Political News

‘క్వాంట‌మ్ కంప్యూటింగ్ దేశానికే గేమ్ ఛేంజ‌ర్‌’

అమ‌రావ‌తిలో కొత్త వెలుగులు సంత‌రించుకున్నాయి. గ‌త ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రానికి శ‌నివారం సాయంత్రం భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి జితేంద్ర‌సింగ్ పాల్గొన్నారు. అనంత‌రం.. సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. అమ‌రావ‌తిలో ఏర్పాట‌వుతున్న క్వాంట‌మ్ కంప్యూటింగ్ దేశానికే `గేమ్ ఛేంజ‌ర్` అని వ్యాఖ్యానించారు. సాంకేతిక రంగంలో క్వాంటమ్‌ వేగం మ‌రిన్ని కొత్త పుంత‌లు తొక్కేలా చేస్తుంద‌న్నారు. అమ‌రావ‌తి కేంద్రంగా ఏర్పాట‌వుతున్న క్వాంట‌మ్ కంప్యూటింగ్ అనేక కీల‌క మార్పుల‌కు శ్రీకారం చుడుతుంద‌న్నారు.

రాబోయేరోజుల్లో ఇక్క‌డ నుంచే క్వాంట‌మ్ ఉత్ప‌త్తులు ఎగుమ‌తి ఎవుతాయ‌ని.. త‌ద్వారా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవ కాశాలు కూడా ల‌భిస్తాయ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు అమ‌రావ‌తికి ల‌భిస్తాయ‌ని తెలిపారు. విజ‌న్ ఉంటే ఏదైనా సాకారం అవుతుంద‌న్న సీఎం చంద్ర‌బాబు.. వ‌చ్చే 40 సంవ‌త్స‌రాల భ‌విత‌ను దృష్టిలో పెట్టుకుని క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని రాజ‌ధానిలో నెల‌కొల్పిన‌ట్టు పేర్కొన్నారు. క్వాంట‌మ్ మిష‌న్‌ను కేంద్ర ప్ర‌భుత్వం కీల‌కంగా భావిస్తోంద‌ని, ఇది ఏపీ నుంచే ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు.

ప‌చ్చ‌ద‌నానికి ప్ర‌తీక‌!

అమ‌రావ‌తి రాజ‌ధాని.. ప‌చ్చ‌ద‌నానికి ప్ర‌తీక అని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఇక్క‌డ ప్ర‌తి అంగుళంలోనూ ప‌చ్చ‌ద‌నం సాక్షాత్కరించ‌నున్న‌ద‌ని తెలిపారు. దీంతో గాలి నాణ్య‌త కూడా పెరుగుతుంద‌ని.. రాజ‌ధాని ప‌రిధిలో నివ‌సించే వారి ఆయుప్ర‌మాణాలు కూడా కొన్ని ఏళ్ల పాటు పెర‌గ‌నున్నాయ‌ని చెప్పారు. రాజ‌ధానిలో డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, మెడ్ టెక్, స్పేస్ సిటీ ల‌ను కూడా అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇదేస‌మ‌యంలో ప్రైవేటు కంపెనీల‌ను కూడా సాధ్య‌మైనంత వేగంగా ప‌నులు ప్రారంభించేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

ప్ర‌ధానికి ప్ర‌శంస‌లు..

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. దేశానికి స‌రైన స‌మ‌యంలో స‌రైన నాయ‌కు డు ప్ర‌ధానిగా ఉండ‌డం అంద‌రికీ క‌లిసి వ‌చ్చిన ప‌రిణామంగా పేర్కొన్నారు. దేశీయంగానే కాకుండా అంత‌ర్జాతీయంగా కూడా.. ప్ర‌ధాని ప్ర‌భ వెలుగుతోంద‌న్నారు. కాగా.. ఈ ఏడాది చివ‌రి నాటికి తొలి క్వాంట‌మ్ కంప్యూట‌ర్ రావాల‌ని.. సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 2030లోగా 2.5 లక్షల మంది క్వాంటమ్‌ నిపుణులు కావాలని నిర్దేశించారు.

This post was last modified on February 7, 2026 7:57 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

1 hour ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

1 hour ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

1 hour ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

3 hours ago