Trends

హైదరాబాద్ లో అద్దెకు బాయ్ ఫ్రెండ్లు

హైదరాబాద్ లో రోజురోజుకూ పాశ్చత్య సంస్కృతీ పెరిగిపోతుంది. కో లివింగ్ పీజీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉద్యోగం, చదువు పేరుతో మహా నగరంలో అడుగుపెట్టిన యువత రంగురంగుల లోకంలో పడిపోతున్నారు. తేనే పూసిన కత్తులతో దోస్తీ చేస్తున్నారు. ఇలాంటి వారి బలహీనతలను క్యాష్ చేసుకుందుకు కొందరు మోసగాళ్లు వల వేస్తున్నారు.

అందమైన అబ్బాయిలను ఎరగా వేసి అమ్మాయిలను మోసం చేసేందుకు తెగిస్తున్నారు. ఇందులో భాగమే అద్దెకు బాయ్ ఫ్రెండ్. మార్కెట్లో వస్తువులకు ఇచ్చినట్లు వీరికి భారీ ఆఫర్లు.. డిస్కౌంట్లు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం చూసిన జనాలు నోటి మీద వేలేసుకుంటున్నారు. హతవిధి.. ఏం పోయే కాలం దాపురించింది అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఈ గంట, అరగంట బాయ్ ఫ్రెండ్ల ఫీజు వివరాలు ఇలా వున్నాయి.

ఇన్ స్టా, టెలిగ్రామ్,ఫేస్ బుక్ వేదికగా 1st ఆగస్టు స్పెషల్ – 50% ఆఫ్. రెంట్ బాయ్ ఫ్రెండ్, యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలను ప్రచారం చేస్తున్నారు. కాఫీ మీట్ కు రూ. 499 , సినిమా డేట్ కు రూ.1249, షాపింగ్ కు రూ. 1499, ఈవెంట్లకు, పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూ. 1999, 10 గంటల ఫుల్ ప్యాకేజి 4,499లంటూ మెనూ కార్డు ప్రచారం చేస్తున్నారు. అందమైన అబ్బాయిల ఫోటోలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్రకటన చూసిన వెంటనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదంతా సైబర్ నేరగాళ్ళు విసురుతున్న డేటింగ్ ట్రాప్ అని హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జన్నార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. రెంట్ బాయ్ ఫ్రెండ్ ప్రకటనపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

ఇలాంటి ప్రకటనలు ఎవరూ నమ్మవద్దని, పొరపాటున కూడా డబ్బులు చెల్లించవద్దని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో కలిసి తిరిగితే చేజేతులా సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనని, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేసే అవకాశం వుందని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయొద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 కు కాల్ చేయాలని సూచించారు. తల్లీదండ్రులు కూడా పిల్లలపై ఒక కన్నేయాలని, ఏం చేస్తున్నారు, ఎవరితో ఛాటింగ్ చేస్తున్నారన్నది గమనించాలని కమిషనర్ సజ్జన్నార్ సలహా ఇచ్చారు.

This post was last modified on August 8, 2026 8:59 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

46 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

1 hour ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

8 hours ago