ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని వినిపిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా.. వేతనాలు తీసుకునే ఎమ్మెల్యేలను ఉపేక్షించ రాదన్నది ఆయన ఆలోచన. ఇది మంచిదే. ప్రజల సొమ్మును ఊరికేనే ఇవ్వడాన్ని ఎవరూ సహించరు. దీంతో ఆయన సభకు రాకుండా వేతనాలు తీసుకునే వారిపై చర్యలు తీసుకునేలా.. ఆ సొమ్మును తిరిగి వసూలు చేసుకు నేలా చట్టాన్ని రూపొందించాలన్నది ఆయన ఆలోచన. తద్వారా సభ అంటే గౌరవం, మర్యాద రెండూ పెరుగుతాయని క్రమశిక్షణ కూడా అలవడుతుందని ఆయన భావిస్తున్నారు.
గత ఏడాది రాజస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ.. సభాపతుల సమావేశంలో కూడా.. అయ్యన్న పాత్రుడు ఈ విషయాన్ని ఎలుగెత్తారు. సభలకు రాకుండా తప్పించుకుని.. నెల నెలా వేతనాలు పొందుతున్న సభ్యుల విషయంలో దృష్టి పెట్టాలని సూచించారు. ఇక, పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాను రెండు సార్లు కలుసుకుని.. ఆయన దీనికి సంబంధించిన వినతి పత్రం కూడా అందించారు. ఇక, ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వమే బిల్లును రూపొందించి.. పంపాలన్నది ఆయన ప్లాన్. దీనికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక, వైసీపీ అధినేత జగన్ ఆకాంక్ష మరో విధంగా ఉంది. తమకు 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. కానీ, అది ఏమైందో.. ఏదశలో విచారణ జరుగుతోందో కూడా తెలయని పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. జగన్ ఆశలు నెరవేరడం లేదు. మరో రెండున్నరేళ్లలో ప్రభుత్వ సమయం కూడా గడిచిపోయి.. ఎన్నికలు రానున్నాయి. అంతేకాదు.. వచ్చే ఏడాది నుంచి జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అంటే.. ఆయన కోరుకుంటున్నట్టు ప్రధాన ప్రతిపక్ష హోదా ఈ ఏడాది లోనే రావాల్సి ఉంటుంది.
ఇది అంత సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు.. ఉన్న 10 మందినైనా సభకు పంపించవచ్చుకదా? అనే అంశాన్ని కూడా ఎటూ తేల్చకపోవడం గమనార్హం. కొత్తగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు.. ఇప్పటి వరకు సభ ముఖం చూసింది లేదు. నిజానికి ఏ ఎమ్మెల్యేకైనా.. కొత్తగా ఎన్నికయ్యాక.. సభకు రావాలని ఉంటుంది. కానీ, ఈ విషయంలో జగన్ వారికి అడ్డు చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్లాలని.. అది కూడా సీఎం చంద్రబాబు మాట్లాడినంత సమయం తనకు సభలో సమయం కేటాయించాలన్న డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ఈ ఆశలు ఇప్పట్లో తీరేనా? అనేది సందేహం.
This post was last modified on August 12, 2026 5:15 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…