క్రిస్మస్ తాత అసలు ముఖం ఎలా ఉంటుందో చూపించిన శాస్త్రవేత్తలు…

శాంటా క్లాస్ కి సంబంధించి మన చుట్టూ ఎన్నో ఫోటోలు, ఎన్నో ఆనిమేటెడ్ చిత్రాలు ఉన్నాయి. కానీ శాంటా క్లాస్ నిజంగా ఎలా ఉంటారు అనేది ఎవరికీ తెలియదు. సెయింట్ నికోలస్ బహుమతులు ఇచ్చే వ్యక్తిత్వం కారణంగా శాంటా క్లాస్ అనే వ్యక్తిని ఎప్పుడో సంవత్సరాల క్రితం చిత్రీకరించారు. కొందరు అతను నిజంగా ఉన్నాడు అని భావిస్తే కొందరు అది కేవలం కథనం అని అంటారు.