సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి పంచాంగకర్తలు చెబుతుంటారు. ఇదే మాదిరిగా ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా ఒక పంచాంగ కర్త చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా పంచాంగకర్త పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి వారిని తిట్టడం, దేవతలను నిందించడం, గోవులను, బ్రాహ్మణులను, ధర్మాన్ని నిందించడం వంటివి చేసేవారికి హింస తప్పదట. వాళ్లకు పరాభవం జరుగుతుందట.
అందుకే, మౌనం మంచిదని, మైకులిచ్చినా ఎక్కువగా కాకుండా తక్కువగా మాట్లాడకుంటే రాజకీయ నాయకులకు పరాభవం తప్పదట. ఇక, యూట్యూబుల్లో వ్యూస్ కోసం, వాటి కోసం పిచ్చి పిచ్చి థంబ్ నెెయిల్స్ పెట్టి సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టేవారికి పరాభవం తప్పదని ఆ పంచాగకర్త సెలవిచ్చిన వీడియో వైరల్ అయింది.
ఇక, ఈ సంవత్సరం…భారత దేశంలో పరిపాలనలో న్యాయస్థానాల జోక్యం విపరీతమవుతుందట. కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చ, వాటికి న్యాయస్థానాల వత్తాసు విరివిగా ఉంటుందట. అంతర్జాతీయ న్యాయ వేదికపై భారత దేశం తిరుగులేని ముద్ర చూపుతుందట. అంతేకాదు, ఇతర దేశాలకు భారత దేశం పరాభవం చేసే సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరం అని ఆ పంచాంగ కర్త చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
