నాగ్ మలయాళ సినిమా మొదలైంది

నాగ్ మలయాళ సినిమా మొదలైంది

అక్కినేని నాగార్జున ఈ మధ్య తెలుగులో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువగా నటిస్తున్నాడు. ఆయన హిందీలో ‘బ్రహ్మాస్త్ర’తో పాటు తమిళంలో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘రుద్ర’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మలయాళంలోనూ అడుగుపెడుతున్నారు. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కపోయే ‘మరాక్కర్’ అనే సినిమాలో నాగ్ ఓ కీలక పాత్ర చేయబోతుండటం విశేషం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నటిస్తాడట. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం శనివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.

ప్రియదర్శన్‌ తో తెలుగులో నాగార్జున ‘నిర్ణయం’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తనయురాలు కళ్యాణిని ‘హలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసింది నాగార్జునే. ఇప్పుడు నాగార్జునను మలయాళంలో పరిచయం చేస్తున్నాడు ప్రియదర్శన్. ‘మరాక్కర్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం బహు భాషల్లో రిలీజ్ కానుంది. ప్రియదర్శన్-మోహన్ లాల్ కాంబినేషన్లో 30కి పైగా సినిమాలొచ్చాయి. చివరగా వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఒప్పం’ కూడా సూపర్ హిట్టయింది. ఆ చిత్రం తెలుగులో ‘కనుపాప’ పేరుతో రిలీజైంది. ఈసారి ఏకంగా వంద కోట్ల సినిమా చేస్తున్నారు ఈ ఇద్దరు మిత్రులు. మలయాళ సినిమాను మరో మెట్టు ఎక్కించే చిత్రం ఇదంటున్నారు. మరి ఈ సినిమా నాగార్జున కెరీర్‌కు ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English