ఒకే నిర్ణయం రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. అప్పట్లో తాను వేసిన అడుగు తప్పటడుగు అని తెలిసుకునేటప్పటికే అంతా అయిపోయింది. అప్పుడు చేసిన పనికి ఇపుడు తీరిగ్గా పశ్చాత్తాపడుతున్నారు. ఇదంతా ఎవరి గురించంటే మాజీ ఎంపి బుట్టా రేణుక గురించే. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున కర్నూలు ఎంపిగా పోటి చేసేంతవరకు చాలామందికి అసలు బుట్టా రేణుకంటే ఎవరో కూడా తెలీదు. పార్టీకి విధేయతతో ఉంటుందని, చదువుకున్న మహిళని, విషయ …
Read More »బెజవాడ పశ్చిమలో సైకిల్ తిరిగేదెన్నడు?
టీడీపీ చరిత్రలో పట్టు సాధించలేని నియోజకవర్గాల్లో.. పార్టీని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నారని ముద్ర వేసుకున్న నియోజకవర్గాల్లో ఒకటి అత్యంత కీలకమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. బెజవాడ మొత్తంగా పార్టీ దూకుడు ఉంటుంది. కానీ, వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం జెండా పట్టుకునే నాథుడు కనిపించరు. పోనీ.. ఇక్కడ నాయకులకు కరువుందా? అంటే.. విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న నివాసం ఉన్నది ఈ నియోజకవర్గంలోనే! అయినా కూడా పార్టీ పుంజుకుంటున్నది …
Read More »చేరిన వాళ్ళ కన్నా సస్పెండ్ అయిన నేతలే ఎక్కువా ?
రాష్ట్ర బీజేపీలో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్ర బిజేపీలో చాలామంది ఇతర పార్టీల నుండి వచ్చి చేరిపోతారని మొదట్లో కమలనాధులు అనుకున్నారు. అయితే కేంద్రంలో అధికారం విషయాన్ని పక్కనపెట్టేస్తే రాష్ట్రంలో మాత్రం పార్టీ ఏమాత్రం బలపడలేదన్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే కేంద్రంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మాత్రం కనీసం గట్టి ప్రతిపక్షంగా కూడా ఎదగలేదనే అనుమానాలుండటమే ప్రధాన కారణం. ఇక్కడ …
Read More »పొన్నూరులో ఎంఎల్ఏకి వ్యతిరేకంగా ప్రత్యర్ధులు ఏకమయ్యారా ?
రాష్ట్రమంతా రాజకీయాలు ఒక పద్దతిలో నడుస్తుంటే గుంటూరు జిల్లాలోని పొన్నూరులో మాత్రం రివర్సులో నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి దూళిపాళ నరేంద్ర చౌదరిపై వైసీపీ అభ్యర్ధి కిలారు రోశయ్య మంచి మెజారిటితో గెలిచారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వడ్లమూడి మైనింగ్ లో అక్రమాలకు ఎంఎల్ఏ పాల్పడుతున్నట్లు మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై రోశయ్య స్పందిస్తు ఓడిపోయిన కోపంతోనే నరేంద్ర తనపై …
Read More »ఏపీ పంచాయతీ- ఏకగ్రీవాలపై ఏం జరగనుందో
స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల సమావేశంలో అసలు అజెండా ఏమిటి ? ఈనెల 28వ తేదీన ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. ప్రధాన అజెండా ఏమిటంటే కరోనా వైరస్ నేపధ్యంలో ఇపుడు ఎన్నికలు జరపచ్చా ? లేదా ? అన్న విషయంపై ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ మీటింగ్ పెడుతున్నారు. మునుపటి కంటే ఎక్కువ కరోనా …
Read More »పోలవరం బాధ్యతను మళ్ళీ కేంద్రానికి అప్పగించేస్తుందా ?
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇటువంటి ప్రతిపాదనలే వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెకక్టు సవరించిన అంచనా వ్యయం రూ . 47725 కోట్లుగా కేంద్రమే ఆమోదించింది. అలాంటిది కొత్తగా సవరించిన అంచనా వ్యయం రూ. 20,398 కోట్లే అని చెప్పటంపై జగన్ తీవ్రంగా మండిపోయారు. జరిగిన పనులకు సంబంధించి రూ. 2234 కోట్లు ఇచ్చేసిన తర్వాత మిగిలిన రూ. …
Read More »ఎన్నికల కమీషన్ తో కొత్త పంచాయితీ
ప్రభుత్వానికి, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఇఫుడున్న పంచాయితీ చాలానట్లు కొత్తగా మరో పంచాయితీ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుండి తనకు అందిన లేఖపై నిమ్మగడ్డ మండిపోతున్నారు. తొందరలో జరుగబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక, ఎంఎల్సీ ఎన్నికలతో పాటు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ నెల 26వ …
Read More »నారా లోకేష్ 2.0
దేశంలోని రాజకీయ నాయకుల్లో అత్యధికంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న వాళ్లలో నారా లోకేష్ ఒకడు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని సోషల్ మీడియా జనాలు ఒక ఆడుకునేవాళ్లు. ఇప్పటికీ ఆడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ అదే స్థాయిలో టార్గెట్ అయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టడం, మరీ లావుగా ఉండి యువతను ఇన్‌స్పైర్ చేసేలా లేకపోవడం, విషయ పరిజ్ఞానంలో వెనుకబడటం, …
Read More »మంచి టైమ్.. పవన్ మిస్సవుతున్నాడే!
ఏ పార్టీకైనా.. ఎదుగుదల ముఖ్యం. పార్టీ అధినేత ఎంత పాపులర్ ఫిగరైనా.. పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెడి తేనే కదా.. ఓట్లు రాలేవి. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేదు. అప్పట్లో తెలుగు వారి ఆరాధ్య దైవంగా మారిపోయినా.. అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేసరికి రోడ్డుపైకొచ్చేశారు. అప్పటి పొలిటి కల్ సిట్యుయేషన్‌ను నమ్ముకున్నారు. దానికి తగిన విధంగా కెమిస్ట్రీని పండించారు. విన్నయ్యారు. సో.. ఎంత పాపులారిటీ ఉందనేదానికన్నా.. …
Read More »రంగంలోకి లోకేష్.. టీడీపీలో కొత్త జోష్!
పార్టీ అధినేత బయటకు రావడం లేదు. కనీసం చిన్నబాబైనా వస్తే.. మా తడాఖా ఏంటో చూపిస్తాం! అన్న టీడీపీ సీనియర్లకు ఆ సమయం వచ్చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు బయటకు రాకపోయినా.. ఆయన కుమారుడు, భావి టీడీపీ అధ్యక్షుడు నారా లోకేష్ బయటకు వస్తున్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వరద ప్రభావిత జిల్లాలను వరుస పెట్టి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రైతులను నేరుగా కలుస్తున్నారు. మోకాల్లోతు నీటిలో కూడా నిర్భయంగా దిగుతూ.. …
Read More »తిరుగుబాటు ఎంపి అసలు వ్యూహం ఇదేనా ?
నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. తాను రాజీనామా చేస్తే జరగబోయే ఉపఎన్నికలు ఎలాగుండాలనే విషయంలో మంచి క్లారిటితోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. మీడియాతో ఎంపి మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తే అమరావతి అంశమే రెఫరెండంగా ఉపఎన్నికలు జరుగుతాయని బల్లగుద్ది చెబుతున్నారు. అపుడు అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సిఎం వ్యతిరేక ఓట్లన్నీ తనకు పడతాయనే ఆశతో ఉన్నారు. అమరావతిలోనే రాజధాని …
Read More »రాహుల్ కి మంచి అస్త్రాలిస్తున్న మోడీ
మొదటి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. కాకపోతే రాజకీయ నేతల ప్రసంగాలలకు, ఆరోపణలు, విమర్శలకు మామూలు అంశాలు సరిపోవన్నట్లుగా సైన్యాన్ని లాగుతుండటమే విచిత్రంగా ఉంది. ఆమధ్య భారత భూభాగంలోకి చైనా సైన్యాలు చొచ్చుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో గాల్వాన్ లోయలో జరిగిన గొడవలో భారత్ సైనికుడు 20 మంది చనిపోయారు. ఆ విషయమై తాజాగా ఎన్నికల ప్రచార …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates