దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అని కాదు థర్డ్ వేవ్ అని మరికొందరు అంటున్నారు కానీ విషయం ఏదైనా మళ్ళీ కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్-5 ఏదో పేరుకి అమలవుతోంది కానీ దేశం మొత్తం ఫ్రీ అయిపోయింది ఎప్పుడో. ఎప్పుడయితే నిబంధనలను ఉల్లంఘించి జనాలు రోడ్లమీదకు వచ్చేశారో అప్పటి నుండే కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దాంతో మళ్ళీ లాక్ డౌన్ తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇక్కడ ఎవరూ ఏమీ చేయలేని పరిస్ధతి కనిపిస్తోంది. లాక్ డౌన్ పేరుతో జనాలను ఎంతో కాలం ప్రభుత్వాలు ఇళ్ళకే పరిమితం చేయలేందు. ఎందుకంటే ఇల్లు గడవాలంటే కష్టపడాల్సిందే. కష్టపడాలంటే అందుకు తగ్గ వ్యాపారాలో, ఉద్యోగాలో, ఉపాధి అవకాశాలో ఉండాల్సిందే. పేదలకంటే ఏదో పథకం పేరుతో ప్రభుత్వాలు నిత్యావసరాలు, డబ్బులు కూడా ఎంతో కొంత సర్దుబాటు చేస్తుంది. ఇదే సమయంలో సంపన్నులు కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మధ్య తరగతి కుటుంబాల మాటేమిటి ?
ఇందులో భాగంగానే ప్రభుత్వాలు ఒక్కో రంగాన్ని రిలాక్స్ చేస్తోంది కాబట్టే జనాలు కూడా రెడ్లపైకి వచ్చేస్తున్నారు. దాంతో కేసుల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా పెరుగుతున్న కేసులను తీసుకుంటే మొదటి ఢిల్లీలో పెరిగిపోతున్నాయి. అందుకనే రాత్రుళ్ళు ఢిల్లీలోని చాలా ఏరియాల్లో కర్ఫ్యూ పేట్టేసింది ప్రభుత్వం. లాక్ డౌన్ అంటే 24 గంటలూ కర్ఫ్యూ వాతావరణమే ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకనే ముందుజాగ్రత్తగా రాత్రుళ్ళు మాత్రం నిబంధనలు కఠినం చేసేసింది. ఇపుడు మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్ధితులు కనబడుతున్నాయి.
గడచిన 24 గంటల్లో దేశంలో 45 వేల కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో వరుసగా ఐదు రోజులుగా 6 వేల కేసులు నమోదవుతునే ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళలో కూడా కొత్తగా 5500 వేల కేసుల చొప్పన నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్లో సుమారు 4 వేల కేసులు రిజస్టర్ అయ్యాయి. ఇలా ప్రతి రాష్ట్రంలో వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దేశంలో సుమారు 450 మంది చనిపోయారు.
కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ లో కూడా రాత్రుళ్ళు కర్ఫ్యూ విధించేశారు. డిసెంబర్ 1వ తేదీనుండి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. మహారాష్ట్రప్రభుత్వం కూడా కర్ఫ్యూ దిశగానే సాగుతోంది. ఎక్కువ మాట్లాడితే లాక్ డౌన్ పెట్టేస్తామంటూ ముఖ్యమంత్రి ఉత్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన కారణంగా కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా పడింది. లాక్ డౌన్ ను ఎట్టి పరిస్ధితుల్లోను విధించేందుకు లేదంటూ పిటీషనర్ కోరటం గమనార్హం. లాక్ డౌన్ విధిస్తే మహారాష్ట్రలో సుమారు 3 కోట్లమంది కార్మికులు ఇబ్బందులు తప్పవంటూ పిటీషనర్ చెప్పారు. మొత్తం మీద దేశంలో పరిస్ధితులైతే మళ్ళీ లాక్ డౌన్ దిశగానే నడుస్తున్నట్లు అనుమానంగా ఉంది.