ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మిన్ను విరిగి మీద పడినప్పటికి తనదైన స్టైల్ లోనే ఉంటారు తప్పించి.. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే విషయంలో కేసీఆర్ నిశ్చితాభిప్రాయాలు కొన్ని ఉంటాయి. తాను ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని కలుసుకోకూడదన్న దానిపై ఆయన చాలా క్లియర్ గా ఉంటారు. తనకు ఎంత సన్నిహితులైనప్పటికి.. వారికి వారుగా కలుసుకోవాలనుకున్నంతనే కలుసుకోలేని సిత్రం.. కేసీఆర్ …
Read More »కేరళ మోడల్ లో చంద్రబాబు వెళ్ళక తప్పదా ?
పార్టీ బలోపేతం అవ్వాలన్నా, పూర్వవైభవం రావాలన్నా అర్జంటుగా చంద్రబాబునాయుడు కేరళనే ఆదర్శంగా తీసుకోవాలేమో. తొందరలో కేరళకు ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపధ్యంలో 20వ తేదీన కొలువు తీరబోతున్న మంత్రివర్గంలో అందరు కొత్తముఖాలే కనబడబోతున్నాయి. సీపీఎం నుండి ప్రమాణం చేయబోయే 12 మంది మంత్రులూ కొత్తవారే. ఇక సీపీఎం భాగస్వామ్య పార్టీ అయిన సీపీఐ, కేరళా కాంగ్రెస్ కూడా కొత్త వారికే అవకాశాలు కల్పించాలని …
Read More »తారక్ కోసం లోకేష్ వచ్చాడు.. బాబు రాలేదు
జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అవసరానికి వాడుకుని వదిలేశాడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. 2009 ఎన్నికల ముంగిట ప్రచారానికి తారక్ సాయం తీసుకోవడం, అప్పుడు అతడికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇవ్వడం.. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అతణ్ని పట్టించుకోకపోవడం.. పైగా ఆ పరాజయాన్ని తెలుగుదేశం వర్గాలు అతడికి ఆపాదించే ప్రయత్నం జూనియర్ రాముడి అభిమానులను బాధించిన మాట వాస్తవం. తారక్‌ను ఆదరిస్తే, …
Read More »కేసీయార్ చేసిన పని జగన్ చేయగలరా ?
కరోనా వైరస్ రోగుల్లో ఆత్మ స్ధైర్యాన్ని నింపే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కేసీయార్ ను ఫాలో అయితే బాగుంటుంది. ముఖ్యమంత్రయిన దగ్గర నుండి కేసీయార్ గాంధి ఆసుపత్రిలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. తనకు ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైనా సోమాజిగూడలోని కార్పొరేట్ ఆసుపత్రికే వెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. కేసీయార్ గాంధిలో అడుగుపెట్టింది వైద్య పరీక్షల కోసంకాదు. కరోనా వైరస్ రోగులను …
Read More »కేసీఆర్ ను ఈటల ఇంతగా భయపెట్టారా?
నిజమే… ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే… టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… మొన్నటిదాకా తన కేబినెట్ లో ఓ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ ను చూసి బాగానే భయపడినట్టున్నారు. ఈటలను ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్… ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. త్వరలో అది కూడా జరిగే తీరుతుందన్న వాదనలైతే వినిపిస్తున్నాయి. కేబినెట్ నుంచి గెంటేయబడ్డా… ఈటల ఇంకా టీఆర్ఎస్ …
Read More »ముగ్గురు ముగ్గురే.. ఒక్కరు మాస్కు పెట్టుకోరా జగన్?
విషయం ఏదైనా కావొచ్చు. చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. కరోనా విషయంలో ఏ చిన్న ఏమరపాటు సరికాదు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన చుట్టు ఉన్నవారు ఎందుకు మర్చిపోతున్నారు. ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఏపీ సీఎం ముఖానికి మాస్కుపెట్టుకోకపోవటం తెలిసిందే. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పించి ఆయన ముఖానికి మాస్కు పెట్టుకోరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ …
Read More »స్టార్లెందుకు.. ముఖ్యమంత్రే రంగంలోకి దిగాడు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మెప్పూ పొందుతున్నాడు డీఎంకే అధినేత స్టాలిన్. కొవిడ్ నియంత్రణ దిశగా లాక్ డౌన్ సహా కొన్ని కఠిన చర్యలకు తోడు.. వైద్య సదుపాయాలు పెంచడానికి ఆయన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం ప్రశంసలందుకుంది. ఇక ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతిపక్ష నేత పన్నీర్ సెల్వంను మర్యాదపూర్వకంగా ఇంటికెళ్లి కలుసుకోవడం.. ఓ ప్రభుత్వ కమిటీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు …
Read More »వైసీపీలో వారసులకు జగన్ చెక్ ?
భారత్‌లో వారసత్వ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాంధీ, నెహ్రూల కుటుంబాల్లో ఏకంగా ఏడు దశాబ్దాలుగా వారసులే రాజకీయాలు చేస్తున్నారు.. ఇంకా చేస్తూనే ఉంటారు. ఇక జాతీయ రాజకీయాలే కాకుండా.. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు చెందిన రాజకీయ నేతల వారసులు మూడో తరంలోనూ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. చంద్రబాబు, జగన్, కేటీఆర్ ఇలా ఎవరు చూసుకున్నా వారసత్వ రాజకీయాల్లోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతల …
Read More »కేరళలో సీపీఎం కొత్త ప్రయోగం
20వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న పినరయి విజయన్ మంత్రివర్గం విషయంలో సీపీఎం కొత్త ప్రయోగం చేయబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తోంది. ఎల్డీఎఫ్ కూటమిలో సీపీఎం ప్రధాన భాగస్వామి. కూటమిలోని ఇతర పార్టీల సభ్యులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అయితే సీపీఎం తరపున మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నవారంతా కొత్తవారే. ఇప్పటివరకు మంత్రులుగా బాధ్యతలు చూసిన వారిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకూడదని సీపీఎం నిర్ణయించింది. …
Read More »బెంగాల్లో మొదలైన మోడి ఆపరేషన్ ?
అందరు అనుమానిస్తున్నట్లే పశ్చిమబెంగాల్లో నరేంద్రమోడి తనదైన పద్దతిలో ఆపరేషన్ మొదలుపెట్టారా ? ఇదే అనుమానం పెరిగిపోతోంది. సోమవారం బెంగాల్లో ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్టు చేయటంతో రాజకీయ రచ్చ మొదలైంది. మంత్రులిద్దరితో పాటు తనను కూడా అరెస్టు చేయాలని మమతబెనర్జీ నానా యాగీ చేస్తున్నారు. నారదా స్కాంలో మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రత ముఖర్జీ+మరో ఇద్దరు సీనియర్ నేతలను సీబీఐ అరెస్టు చేయటం సంచలనంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో మమతబెనర్జీని …
Read More »పార్టీల్లో పెరిగిపోతున్న టెన్షన్
నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చేసిన పరీక్షల విషయంలో అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా మున్సిఫ్ కోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు డాక్టర్ల బోర్డు ఒకసారి ఎంపికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీలో ఉన్నపుడు పోయిన శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దారుణంగా కొట్టారంటు ఎంపి చేసిన ఆరోపణల నేపధ్యంలో వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం వచ్చింది. …
Read More »ఆక్సిజన్ లో కూడా దెబ్బకొట్టిన మోడి సర్కార్
రాష్ట్రవసరాలను నరేంద్రమోడి సర్కార్ ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతునే ఉంది. తాజాగా ఆక్సిజన్ సరఫరాలో కోత విధించటమే నిదర్శనం. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) అంటే అందరికీ అర్ధం కాకపోవచ్చు. కానీ వైజాగ్ స్టీల్స్ అంటే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తుంది. వైజాగ్ స్టీల్స్ ప్రతిరోజు భారీఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. అయితే ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ మొత్తాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించుకునేందుకు లేదు. ఎందుకంటే ఈ సంస్ధ కేంద్రానికి కాబట్టి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates