నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవిలను తెగ తిప్పుతూ విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు. కాలేజీలు, హోటళ్లు అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రతి చోటికి వెళ్లి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కాకపోతే ఆశించినంత బజ్, సౌండ్ సామజిక మాధ్యమాల్లో కనిపించడం లేదు.
ఎందుకంటే కోర్ట్ జెన్యూన్ బ్లాక్ బస్టరే కానీ అది రోషన్, శ్రీదేవి జంట వల్ల ఆడిన సినిమా కాదు. అరెస్టింగ్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామా, మంచి సంగీతం దానికి దోహదం చేశాయి. కథలో హీరో హీరోయిన్ మెయిన్ కాబట్టి వాళ్ళు అందులో ప్రధాన భాగం అయ్యారు తప్పించి ఆ పాత్రలు ఇంకెవరు చేసినా అంతే డ్రామా పండేది. పైగా కోర్ట్ లో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్, హంగులు లేవు, జస్ట్ క్లీన్ మూవీ.
కానీ బ్యాండ్ మేళం అలా కాదు. హుషారైన పాటలు, డాన్సులు, రవితేజ స్టయిల్ లో రోషన్ కి డిజైన్ చేసిన క్యారెక్టర్, అల్లరి అమ్మాయిగా శ్రీదేవి మొత్తం సెటప్ మాస్ ని టార్గెట్ చేసుకున్న వైనం స్పష్టం. అయితే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వీళ్ళతో ఎన్ని డాన్సులు చేయిస్తున్నా అవి సరైన రీతిలో వైరల్ కాకపోతున్న వైనం గమనించవచ్చు. స్టార్ ఇమేజ్ లేని ఆర్టిస్టులకు కమర్షియల్ కోటింగ్ ఇస్తే వచ్చే రిస్క్ ఇలాగే ఉంటుంది.
ముందైతే అసలు బ్యాండ్ మేళంలో ఎలాంటి కంటెంట్ ఉందో మరింత స్పష్టంగా ట్రైలర్ రూపంలో ఇవ్వాలి. ఇప్పటికే ముందుకు వెనక్కు జరిపి మూడు రిలీజ్ డేట్లు మార్చి ఫైనల్ గా మార్చి 26 లాక్ చేసుకున్నారు. దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన జస్ట్ వన్ వీక్ కే ఒక చిన్న సినిమా దిగడం సాహసమే అయినా కంటెంట్ మీద నమ్మకంతో కోన వెంకట్ రిస్కుకు సిద్దపడ్డారు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. బాలన్స్ పాటలు వదలాలి. చాలా జరగాలి. రెండు వారాలు టైం ఉంది కాబట్టి ఆలోగా బ్యాండ్ సౌండ్ పెరుగుతుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates