కారుపార్టీపై తెలంగాణాలోని యూత్ ఓటర్లు ఎక్కువగా మండిపోతున్నారట. దీనికి అనేక కారణాలున్నాయి. ప్రతినెలా కేసీయార్ చేయించుకుంటున్న సర్వేల్లో ఈ విషయం బయటపడిందట. అందుకనే యూత్ కు దగ్గరై వాళ్ళల్లోని ఆగ్రహాన్ని తగ్గించే బాధ్యతలను కొడుకు కేటీయార్ కు కేసీయార్ అప్పగించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. యూత్ 18-35 ఏళ్ళమధ్య ఉన్న వాళ్ళని సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళంతా ప్రభుత్వంపై అనేక కారణాలతో బాగా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వంపై మెజారిటి యూత్ ఆగ్రహంగా ఉండటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే ఉద్యోగాలు ఇవ్వకపోవటం. నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని అనుకున్నా చాలా పరీక్షల ప్రశ్నపత్రాలు లీకవ్వటం, దాంతో ఆ పరీక్షలు రద్దవటం లాంటివాటితో యూత్+నిరుద్యోగులు మండిపోతున్నారు. గ్రూప్ 1 పోస్టులకు సుమారు 5 లక్షలమంది నిరుద్యోగులు, ఫ్రెస్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కేటగిరిలోని వివిధ పోస్టుల ప్రశ్నపత్రాలు లీకైన విషయం అందరికీ తెలిసిందే.
ఇదికాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పేపర్లు కూడా లీకయ్యాయి. దీంతో కొన్ని పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తే మరికొన్ని జరిగిపోతున్నాయి. నిజానికి ప్రభుత్వంలోకి వచ్చిన తొమ్మిదేళ్ళల్లో రెగ్యులర్ గా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన కేసీయార్ ప్రభుత్వం అసలు ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేనేలేదు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమనే ప్రచారం కారణంగా మాత్రమే హడావుడిగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తోంది. ఏదేమైనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైంది.
ఇదే సమయంలో ప్రభుత్వ విధానాల కారణంగా జనాలు కేసీయార్ పాలనపై మండిపోతున్నారట. ఇదంతా చూస్తున్న యూత్ కారు పార్టీపై బాగా ఆగ్రహంగా ఉన్నారు. వీళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చకపోతే రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమైపోతోందనే టెన్షన్ కేసీయార్ లో పెరిగిపతోందట. నిరుద్యోగులు, యూత్ కొన్ని లక్షలమంది ఓటర్లరూపంలో ఉన్నారు. వీళ్ళు వ్యతిరేకం అవటమే కాకుండా వాళ్ళ తల్లి, దండ్రులతో పాటు తమ ఊర్లలో తెలిసిన వాళ్ళందరినీ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేయించే ప్రమాదముందని కేసీయార్ గ్రహించారు. అందుకనే వీళ్ళని మంచి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరెంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.