జ‌గ‌న్‌కు క‌డ‌ప క్లీన్ స్వీప్ క‌ష్ట‌మే.. ఎన్ని కార‌ణాలంటే..!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా.. వైఎస్ కుటుంబానికి గ‌ట్టి కంచుకోట వంటి జిల్లా క‌డ‌ప. అయితే.. ఇక్క‌డ ఈ సారి వైసీపీ హ‌వా త‌గ్గుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి క‌డ‌ప‌లో మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. రాజంపేట‌, క‌డ‌ప‌. అయితే.. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క రాజంపేట మిన‌హా అన్నీ క్లీన్ స్వీప్ చేసింది

అదేవిధంగా 2019కి వ‌చ్చేసరికి రాజంపేట స‌హా.. మొత్తం రెండు ఎంపీ స్థానాలు.. 10 అసెంబ్లీ స్థానాల‌నూ గెలుచుకుంది. అయితే.. ఈ హ‌వా ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డప వైసీపీకి క్లీన్ స్వీప్ కావ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న బ‌లంగానే వినిపిస్తోంది. దీనికి మొత్తంగా మూడు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

1) వైఎస్ కుటుంబ వివాదాలు. 2) జిల్లా విభ‌జ‌న అనంత‌రం.. ఏర్ప‌డిన వివాదాలు, ప్ర‌జ‌ల డిమాండ్‌ను ప‌రిష్క‌రించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు విఫ‌లం. 3) బ‌ల‌ప‌డుతున్న ప్ర‌తిప‌క్షాలు టీడీపీ, బీజేపీ. వీటికితోడు.. చిన్నాచిత‌కా వ్య‌వ‌హారాలు.. నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేమి వంటివి కూడా వైసీపీని ఈ సారి డామినేట్ చేస్తున్నాయ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కోల్పోయే నియోజ‌క‌వ‌ర్గాల జాబితాలో ఫ‌స్ట్ ప్లేజ్‌లో రాజంపేట అసెంబ్లీ సీటు ఉంద‌ని తెలుస్తోంది.

అదేవిధంగా.. రైల్వే కోడూరులో ఈ సారి టీడీపీ విజ‌యంద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని లెక్క‌లు వ‌స్తున్నాయి. అదేవిధంగా రాయ‌చోటిలో ఎంతో క‌ష్ట‌ప‌డితే త‌ప్ప విజ‌యం ద‌క్క‌ద‌ని అంటున్నారు. అలానే క‌డ‌ప‌లో ఈ సారి మైనారీటీలు.. త‌మ వ్యూహాన్ని మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని.. ప్ర‌స్తుతం ఉన్న వారికే టికెట్ ఇస్తే.. క‌ష్ట‌మ‌ని వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, క‌డ‌ప ఎంపీ స్థానాన్ని మార్చితే.. అంతో ఇంతో గెలిచే ఛాన్స్ ఉంటుంద‌ని లేక‌పోతే.. క‌ష్ట‌మ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే, రాజంపేట ఎంపీ స్థానం మాత్రం వైసీపీకి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. సో..ఎలా చూసుకున్నా.. ఈసారి మాత్రం క‌డప క్లీన్ స్వీప్ చేయ‌డం వైసీపీకి సాధ్యం కాద‌ని చెబుతున్నారు.