జ‌గ‌న్‌.. విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్న మోడీ!

ఔను..జ‌గ‌న్ విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆయ‌న చేస్తున్న త‌ప్పులు త‌మ పీక‌ల‌మీద‌కు రాకుండా.. ప్ర‌జ‌ల్లో త‌మ ప‌ర‌ప‌తి పోకుండా చూసుకునేందుకు.. మోడీ చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మాట వైసీపీ నేత‌లే చెబుతున్నారు. క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ త‌పిస్తున్నారు. త‌ద్వారా.. తాను భావిస్తున్న‌.. (ప్ర‌జ‌లు వ్య‌తిరేకించినా..) మూడు రాజ‌ధానుల‌కు ముందడుగు ప‌డుతుంద‌ని.. అనుకున్నారు.

అయితే.. క‌ర్నూలులో హైకోర్టు విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేద‌ని.. స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇది ఒకందుకు మంచిదే అయినా..జ‌గ‌న్ కేంద్రం మ‌ధ్య‌ ఉన్న ప‌రిస్థితిని తీసుకుంటే.. ఆయన‌కు ఎఫెక్టేన‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం కేంద్రంతో రాసుకుని… పూసుకుని తిరుగుతున్న జ‌గ‌న్‌కు కేంద్రం కేసుల నుంచి త‌ప్ప‌..ఆయ‌న‌కు ఎలానూ ప్ర‌యోజ‌నం చేయ‌డం లేద‌ని.. అంత‌కు మించి రాష్ట్రానికి అంత‌క‌న్నా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు.

తాజాగా క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని భావించిన జ‌గ‌న్‌కు కేంద్రం నుంచి పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. “ముందు మీరు అక్క‌డ ఆమోదించుకుని.. మాకు ప్ర‌తిపాద‌న పంపాలం”టూ.. కేంద్రం స్ప‌ష్టం చేసింది. అంటే.. ఈ ఉద్దేశం వెనుక‌.. కేంద్ర‌లోని మోడీ స‌ర్కారు.. జ‌గ‌న్ విష‌యంలో జాగ్ర‌త్త‌గానే అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌లు తీవ్రస్థాయిలో వ్య‌తిరేకిస్తున్న మూడు రాజ‌ధానుల విష‌యంలో మోడీ ఒకింత జాగ్ర‌త్త‌గా ఉన్నారని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఎందుకంటే.. ఇప్పుడు క‌ర్నూలులో కోర్టు ఏర్పాటు చేస్తే.. ప‌రోక్షంగా.. లేదా ప్ర‌త్య‌క్షంగా.. మోడీ కూడా మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తిచ్చిన‌ట్టే అవుతుంద‌నేది వాస్త‌వం. దీనికి మెజారిటీ ప్ర‌జ‌లు యాక్సెప్ట్ చేయ‌డం లేదు. అలాంటప్పుడు.. ఎలా ముందుకు వెళ్లాలి? జ‌గ‌న్ మునిగినా.. మ‌నం ఎందుకు ప్ర‌జ‌ల‌తో విమ‌ర్శ‌లు చేయించుకోవాలి.. అనే వ్యూహంతోనే మోడీ ప్ర‌బుత్వం క‌ర్నూలులో హైకోర్టు విష‌యంలో బంతిని మ‌ళ్లీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కోర్టులోకే నెట్టేసింది. ఏదేమైనా.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి! మ‌రి జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.