అమిత్ షా ను ఎందుకు పక్కన పెట్టారు ?

Amit Shah Corona

రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయటానికి నరేంద్రమోడి ప్రయత్నాలను మొదలుపెట్టారు. తన ప్రయత్నాల్లో భాగంగానే ఎన్డీయే పార్టీలతోనే కాకుండా యూపీఏ బాగస్వామ్యపక్షాలు, నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలతో పాటు స్వతంత్ర ఎంపీలతో సంప్రదింపులు జరపాలని మోడి అనుకున్నారు. ఇందుకోసమని రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాకు బాధ్యతలు అప్పగించారు. నిజానికి నాన్ ఎన్డీయే పార్టీలను మోడి ఆలోచనలకు అనుగుణంగా ఒప్పించేంత సీన్ వీళ్ళిద్దరికీ లేదు.

ఎందుకంటే మోడి మనసులో ఇప్పటికే కచ్చితంగా ఎవరో ఒక అభ్యర్ధి ఉండేవుంటారు. ఆ విషయం వీళ్ళద్దరికి తెలిసే అవకాశంలేదు. వీళ్ళద్దరు మోడి దూతలుగా ప్రతిపక్షాలతో సంప్రదింపులకు వెళ్ళినపుడు వాళ్ళు మోడి ప్రతిపాదించబోయే అభ్యర్ధి ఎవరని అడుగుతారు. దానికి సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వీళ్ళు చెప్పిందానికి ప్రతిపక్షాల నేతలు అంగీకరించరు.

అయినా మోడి తరపున ఇన్ని సంవత్సరాలుగా అన్నీ వ్యవహరాలను చక్కబెడుతున్నది హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రమే. అలాంటిది ఇపుడు ఇంతటి కీలకమైన బాధ్యతలను అమిత్ షాకు కాకుండా రాజ్ నాద్+నడ్డాకు ఎందుకు అప్పగించినట్లు ? అమిత్ ఏదైనా మాట్లాడినా, హామీఇచ్చినా మోడియే మాట్లాడినట్లు, హామీలిచ్చినట్లే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో రాజ్ నాధ్, నడ్డాలు మాట్లాడితే మోడి దూతలుగానే చూస్తారు కానీ స్వయంగా మోడియే మాట్లాడుతున్నట్లు ఎవరు అనుకోరు.

అమిత్ ను ఎందుకు పక్కనపెట్టారంటే మోడి అంటేనే ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. మోడి మీద ప్రతిపక్షాలకు ఎంతమంటున్నదో అమిత్ అన్నా అంతే మంటుంది. కాబట్టే రాష్ట్రపతి ఎన్నికలాంటి కీలకమైన సంప్రదింపుల ప్రక్రియనుండి అమిత్ ను మోడి దూరంపెట్టినట్లున్నారు. రాజ్ నాద్ సీనియరే కాకుండా సౌమ్యుడిగా పేరున్నది. ప్రతిపక్షాలు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రశాంత వాతావరణంలో చర్చలు జరిగే అవకాశముంది. వీళ్ళద్దరికీ బాధ్యతలు అప్పగించినంత మాత్రాన ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చేస్తాయని ఎవరు అనుకోవటంలేదు. మరి ద్విసభ్య కమిటి జరపబోయే సంప్రదింపులు ఎంతవరకు సాగుతాయో చూడాల్సిందే.