భీమ్లా నాయక్ సినిమా ఏమయినా బాహుబలి లాంటి సినిమానా అని అంటున్నారు కొడాలి నాని. అవును! ఆ సినిమా లాంటి సినిమా ఇది కాదు కానీ ఆ రోజు ఆ సినిమాకు చంద్రబాబు సాయం చేశారు కానీ ఇవాళ తమ సినిమాకు జగన్ సాయం చేయకపోగా ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు జనసేన. ఓ ముఖ్యమంత్రి హోదా లో అందరికీ న్యాయం చేయాలి కానీ కాళ్ల దగ్గరకు మనుషులను రప్పించుకుని తమ అహాన్ని సంతృప్తి పరుచుకోవడం, ఆ విధంగా ప్రవర్తించాలనుకోవడం తగదని అంటున్నారు పవన్ అభిమానులు. అయినా పొలిటికల్ మెగాస్టార్ అయిన జగన్ కు ఇవన్నీ తెలియవు అని తాము అనుకోమని కూడా అంటున్నారు వీళ్లు. ఇక ఈ వివాదం ఎటు వెళ్లనుంది?
సినిమా విడుదల విషయమై కానీ సినిమానిర్మాణం విషయంలో కానీ నానికి మంచి అవగాహన ఉంది.ఆయన ఓ డిస్ట్రిబ్యటర్.ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్..లక్షలాది మందికి అన్నం పెట్టే ఇండస్ట్రీ గురించి ఆయనకు తెలియదా? లేదా కేవలం పవన్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడితే జగన్ ఏమయినా కొత్త పదవులు అందిస్తారా అని జనసేన ప్రశ్నల పరంపర సంధిస్తోంది. రాజకీయంగా తమను టార్గెట్ చేయడంలో భాగంగా ఎవరు ఎన్ని అభియోగాలు అయినా మోపవచ్చు కానీ సినిమానూ, రాజకీయాలనూ లింక్ చేసి మాట్లాడడం తగదు అని అంటోంది జనసేన.
ఇక అసలు విషయానికి వస్తే కొడాలి నాని ప్రెస్మీట్ నిన్నటి వేళ మరిన్ని వివాదాలకు దారి తీసింది.ఆయన అన్నయ్య చిరును ఉద్దేశించి కూడా తక్కువ చేసి మాట్లాడారని అంటున్నారు నాని. కానీ అది నిజం కాదు.ఆయనేమంటున్నారు ఎంతటి వారు అయినా తన కాళ్ల దగ్గరకు రావాల్సిందే అన్నది జగన్ సూత్రం అని ఆ సూత్రం అమలులో భాగంగా చిరు కానీ మరొకరు కానీ ఆయన దగ్గరకు వెళ్లాల్సిందేనని మాత్రమే అంటున్నారు పవన్. ఇందులో తప్పేం ఉంది. ఆ రోజు జరిగింది ఇదే కదా! జగన్ తన మాట నెగ్గించుకునే క్రమానికి ఎంతో విలువ ఇస్తారు అన్నది సుస్పష్టం. ఆ క్రమంలోనే ఆయన చిరు బృందాన్ని తన దగ్గరకు రప్పించుకున్నారు.
భేటీ తరువాత అస్సలు సమస్యలు ఉండవు అని పేర్ని నాని (మంత్రి) కూడా స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు తమ దగ్గరకు ఎవరు వచ్చారో వాళ్ల సినిమాలకే సవరించిన జీఓలు కానీ లేదా మరో లబ్ధి కానీ చేకూరుస్తామని నేరుగా ఎందుకు ఆ రోజు చెప్పలేకపోయారు అని? ఇవీ పవన్ తరఫున ప్రశ్నలు. ఏదేమయినప్పటికీ మంత్రి స్థాయికి తగని మాటలు ఇవి అని, ఇందులో వాస్తవాలు కన్నా వ్యక్తి పూజ ఎక్కువ ఉందని జనసేన విమర్శ చేస్తోంది. పొలిటికల్ మెగాస్టార్ అయిన జగన్ అందరికీ మంచి చేయాలన్న సంకల్పం ఉంటే ఈ విధంగా తమను మాత్రమే వేధించరని కూడా అంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates