మోడి వెనక్కు తగ్గినట్లేనా ?

అలాగే అనిపిస్తోంది వ్యవహారం చూస్తుంటే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో పాటు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా పెరిగిపోయిన వ్యతిరేకత వల్ల మోడి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. దాంతో మొన్నటి వరకు జమిలి ఎన్నికల విషయంలో మోడి వెనక్కు తగ్గినట్లేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దేశంలో జమిలి ఎన్నికల నిర్వహించాలనే విషయంలో నరేంద్రమోడి ఎంత ఆసక్తిచూపారో అందరికీ తెలిసిందే. పార్లమెంటు-రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వేటికవే విడివిడిగా నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయని మి భావించారు. పార్లమెంటు ఎన్నికల్లో జనాలు మోడికి ఓటేస్తున్నా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రాంతీయపార్టీలవైపే మొగ్గుచూపుతున్నారని అనుకున్నారు.

దేశమంతా బీజేపీ ఏలుబడిలోకి రావాలంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే జనాలంతా బీజేపీకే ఓట్లేస్తారని మోడి బలంగా అనుకుంటున్నారు. అయితే ఐదురాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పడిన ఓట్లతో పాటు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో జనాల వ్యతిరేకతను చూసిన తర్వాత అసలు జమిలి ఎన్నికల ఊసే ఎత్తటంలేదు.

అన్నీ అనుకూలంగా ఉంటే 2022-23 లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా జమిలి ఎన్నికల నిర్వహణకు రెడీ అని చెప్పేసింది. ఎలాగైనా జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్దేశ్యంతోనే మోడి నుండి ప్రభుత్వం+పార్టీలోని కీలక నేతలంతా దాదాపు 80 సమావేశాలను నిర్వహించరు. జమిలి కోసం అంతగా ఊగిపోయిన మోడి అండ్ కో ఇపుడు అసలు ఆ ప్రస్తావనే తేవటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత జమిలిపై మోడి వెనక్కు తగ్గినట్లే అనుకుంటున్నారు.