తమిళనాడు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అధికార అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ అలియాస్ చిన్నమ్మను పార్టీలోకి ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ పార్టీలోకి శశికళ రాదలచుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టంగా ప్రకటించారు. పన్నీర్ చేసిన తాజా ప్రకటన తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇదే పన్నీర్+సీఎం, పార్టీ అధినేత పళనిస్వామి ఒకపుడు చిన్నమ్మను పార్టీలోకి రానీయకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. జైలు నుండి విడుదలైన శశికళ చెన్నైకి చేరుకోగానే పార్టీ తనదే అని, తానే పార్టీకి శాశ్వత ప్రధానకార్యదర్శినంటు ప్రకటించిన విషయం తెలిసిందే. చిన్నమ్మ చేసిన ప్రకటనను పై ఇద్దరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
అన్నాడీఎంకేలో చిన్నమ్మ శకం ముగిసిన అధ్యాయమంటు వాళ్ళిద్దరు ఓ సంయుక్త ప్రకటన చేశారు. దాంతో పార్టీలోకి చిన్నమ్మ ఎంట్రీ అప్పట్లో సందిగ్దంలో పడింది. చిన్నమ్మ ప్రయత్నాలతో అన్నాడీఎంకే చీలిపోతుందనేమో అనే టెన్షన్ కూడా మొదలైంది. అయితే అధికారపార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తెరవెనుక చేసిన ప్రయత్నాల కారణంగా చివరకు చిన్నమ్మ రాజకీయాల నుండే తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన కలకలం రేపింది.
బీజేపీ కారణంగా అప్పట్లో చిన్నమ్మను పై ఇద్దరు నేతలు పార్టీకి దూరంగా పెట్టగలిగారు. అన్నాడీఎంకేలోని విభేదాలు, అంతర్గత వివాదాలతో లాభపడవచ్చని డీఎంకే హ్యాపీగా ఫీలైంది. అయితే చివరకు శశికళ చేసిన ప్రకటనతో అధికారపార్టీలో గందరగోళం తగ్గటంతో పరిస్ధితి టైట్ అయిపోయింది. ఇలాంటి నేపధ్యంలోనే చిన్నమ్మను పార్టీలోకి ఆహ్వానిస్తు పన్నీర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
ఎన్నికలు మరికొద్దిరోజుల్లో ఉందనగా హఠాత్తుగా చిన్నమ్మను పార్టీలోకి ఎందుకు ఆహ్వానించారు ? అన్నదే అర్ధం కావటంలేదు. చిన్నమ్మను పార్టీలోకి తీసుకొచ్చి ప్రచారం చేయించుకుని లబ్దిపొందాలని పన్నీర్+పళనిస్వామి ప్లాన్ చేస్తున్నారా అనే సందేహం పెరిగిపోతోంది. మరి తాజా ఆహ్వానంపై శశికళ ఎలా స్పందిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates