ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత నేతలే కన్ను కప్పేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు అక్రమాలు చేశారని.. అన్యాయాలు చేశారని.. పదే పదే చెప్పిన వారు.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. పైకి సచ్ఛీలురుగా.. సైకిల్ ఎక్కుతున్నామనిచెబుతున్న నాయకులే.. అడ్డంగా ప్రజలను దోచేస్తున్నారు. ఇదే దో విపక్ష నాయకులు చేసిన విమర్శకాదు..అత్యంత అనుకూల మీడియా నిప్పులు చెరుగుతున్నంత వాస్త వాలు. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు.. అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు!
జిల్లాను బట్టి దందాలు మారుతున్నాయి. ఉమ్మడి తూర్పులో భూ కబ్జాలు నిత్యంకృత్యం అయ్యాయి. గజం కనిపిస్తే.. గునపం దిగాల్సిందే.. తమ్ముడు అడుగు పెట్టాల్సిందే అన్నట్టుగా తూర్పులో భూ పర్వం సాగు తోంది. ఇది బయటకు రాకుండా.. పొరుగు పార్టీలకు చెందిన వారిని సైతం.. మచ్చిక చేసుకుని మరిపిస్తు న్నారు. కుదిరితే వాటా.. లేకపోతే సంచులతో సరిపుచ్చుతున్నారు. దీంతో జిల్లాలో యథేచ్ఛగా భూమాఫి యా దూకుడు సాగిపోతోంది. అంతిమంగాఇది చంద్రబాబుకే చెడ్డ పేరు తెస్తోంది.
ఇక, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మద్యం మాఫియా ఏరులు పారిస్తోంది. వైన్స్‌లో తెచ్చిన మద్యాన్ని బార్లలో 24 గంటలపాటూ విక్రస్తున్నారు. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. పైగా.. మామూళ్ల వరదలో పోలీసులు జోగుతున్నారు. అంతేకాదు.. పలు జిల్లాల్లో పోలీసులు పంచాయతీ లు చేసేస్తున్నారు. గతంలో పోలీసులకు ఒకింత భయం ఉండేది. వైసీపీ పాలనలో పోలీసులపై తేడా వస్తే.. కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి.
కానీ..ఇప్పుడు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో పోలీసులు.. స్టేషన్లనే అడ్డాగా మార్చేసుకుంటు న్నారు. పశ్చిమ గోదావరిలో పేకాట శిబిరాలకు పోలీసులు అనధికార రక్షణ కల్పిస్తున్నారనే విమర్శలు.. టీడీపీలోని ఓ వర్గం నాయకుల నుంచే వినిపిస్తుండడం గమనార్హం. ఇక, అనంతపురం, కర్నూలులోనూ ఇదే తంతు కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఇసుక, మరికొన్ని చోట్ల మద్యం.. ఇలా అయినకాడికి చంద్రబాబు కన్ను కప్పి.. తమ్ముళ్లు వీరంగం వేసేస్తున్నారు. అయితే.. ఇవి ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ చూపించకపోయినా.. సర్కారుపై మాత్రం మరకలు పడేలా చేస్తోంది.