Movie News

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న జానకి గారు మైసూరులో చికిత్స తీసుకుంటూ కన్ను మూయడం సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా అన్ని భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడిన జానకి గొంతు పరిచయం లేని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఆవిడతో పాట పాడించని సంగీత దర్శకుడు ఎవరని భూతద్దం పెట్టి వెతికినా సమాధానం దొరకదు.  

1938 ఏప్రిల్ 13 గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. మూడు సంవత్సరాల వయసు నుంచే సంగీతం పట్ల ఆ చిన్నారికున్న అభిలాషను గుర్తించి తల్లితండ్రులు శ్రీరామమూర్తి, సత్యవతి ప్రోత్సహించారు. 19 వయసులో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో తన మొదటి పాటను రికార్డు చేశారు. ఆ సినిమా పేరు విదియన్ విలయట్టు. టి చలపతిరావు సంగీతం అందించారు. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంతో స్వంత సీమలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ గాన ప్రయాణంలో జానకి గారు నాలుగుసార్లు జాతీయ పురస్కారం అందుకోగా వాటిలో వంశీ దర్శకత్వం వహించిన సితార సినిమా పాట ‘వెన్నెల్లో గోదారి అందం’ కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పదిసార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మౌన పోరాటంతో సంగీత దర్శకురాలిగా కూడా విజయం సాధించిడం జానకి గారి ప్రతిభకు మచ్చుతునక. ముప్పైకి పైగా వివిధ రాష్ట్ర పురస్కారాలు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాని మైలురాయి.

జానకిగారి భర్త రామ్ ప్రసాద్ 1997లో కన్నుమూయగా వారి ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ సంవత్సరం జనవరిలో చనిపోవడం వ్యక్తిగతంగా కుంగదీసింది. ఘంటసాల, సత్యం, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, కీరవాణి, రాజ్ కోటి, మణిశర్మ లాంటి ఎందరో సంగీత దర్శకులు తమకు జానకి గారు పాడటం అదృష్టంగా భావించేవారు. భౌతికంగా జానకిగారు దూరమైనా, రోజు వినిపించే పాటల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. ఆకాశం, భూమి, జానకి లాంటి గొప్పవారి గాత్రలకు మరణం ఉండదు.  

This post was last modified on July 11, 2026 9:09 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

30 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

38 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

42 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

1 hour ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago