వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఓ వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారన్న క్షకతో బాధితురాలి కుటుంబంతో సహా.. తనకుటుంబానికి చెందిన వారిని కూడా అతను దారుణంగా పొడిచి చంపాడు. ఈ కేసు స్థానికంగా తీవ్రసంచలనం సృష్టించింది.
ఈ ఘటనను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. సదరు హంతకుడికి.. వైసీపీ అధినేత జగన్‌కు మధ్య ఒకే పోలిక ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిదీ సైకో మనస్తత్వమేనన్నారు. సొంత బాబాయిని చంపారని, జన్మనిచ్చిన తల్లిని ఆస్తి కోసం ఇంటి నుంచి గెంటేశాడని అన్నారు. ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెల్లిని కూడా గెంటేయడంతోపాటు సోషల్ మీడియాలోనూ ఆమెపై వికృతంగా పోస్టులు పెట్టించాడని వ్యాఖ్యానించారు. “ఇవన్నీ చూస్తుంటే.. తెలంగాణ హంతకుడిది.. జగన్‌ది ఒకే పోలిక“ అని చెప్పారు.
శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు తొలుత ప్రజల నుంచి విజ్ఞప్తులను తీసుకున్నారు. తర్వాత పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకోపాలన పోయినా.. సైకో మనస్తత్వం ఉన్నవారు పోవడం లేదన్నారు. వీరిని ఎలా దారికి తేవాలో తనకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే సోషల్ మీడియాకు సంబంధించి టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పెట్టుబడులను అడ్డుకుంటున్నారు..
గొడ్డలి పార్టీ నాయకులు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకుంటున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు వస్తే.. రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, యువతకు ఉద్యోగాలు వస్తాయని.. ఇవన్నీ జరిగితే కూటమి సర్కారుకు పేరు వస్తుందని, అందుకే గొడ్డలి పార్టీ నాయకులు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని జగన్‌ను దుయ్యబట్టారు. వాటిని కూడా రాబట్టే విషయంపై ఆలోచన చేస్తున్నామన్నారు.
This post was last modified on July 11, 2026 9:41 pm
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…