Trends

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో… ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్. విలన్ ఒమన్ కు చెందిన ఓ జిహాదీ. దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ వెళుతున్న ‘ఫ్లై దుబాయ్ ‘ విమానంలో బుధవారం జరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. తాను స్వయంగా చావు నోట్లో వున్నప్పటికి ఆదరక బెదరక 180 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన స్మిత్ మచ్చర్ హీరోగా ప్రపంచ ప్రజల జేజేలు అందుకుంటున్నాడు. ఇంతకూ ఏమి జరిగిందంటే…

దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ రాజధాని టెల్ అలివ్ కు ఫ్లై దుబాయ్ విమానం బయలు దేరింది. కాసేపటికే ఆకాశంలో 33 వేల అడుగుల ఎత్తుకు చేరింది. విమానంలోని కాక్ పిట్ లో ఇద్దరు పైలెట్లు వున్నారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు కో పైలెట్ గా ఒమెన్ దేశస్తుడు వున్నాడు. విమానం ఆకాశంలో వుండగా ఒమెన్ దేశానికి చెందిన కో పైలట్ ఒక్కసారిగా కెప్టెన్ స్మిత్ మచ్చర్ మీద దాడికి పాల్పడ్డాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. విమానాన్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. 33 వేల అడుగుల నుంచి 14 వేల అడుగుల కిందకు విమానాన్ని దించాడు. విమానాన్ని కూల్చి వేసి మొత్తం 180 మంది ప్రయాణికులను చంపడానికి ప్రయత్నం చేశాడు.

ఒకవైపు కత్తిపోట్లకు గురైన స్మిత్ మచ్చర్ కు విపరీతంగా రక్త స్రావం జరిగింది. అయినప్పటికీ ఆయన లెక్క చేయలేదు. ఎలాగైనా సరే విమానాన్ని తన అదుపులోకి తీసుకొని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలన్న కృతనిశ్చయంతో కో పైలెట్ తో పోరాడాడు. విమానం కూలి పోకుండా విరోచితంగా పోరాడి తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు. ఈ లోపు కాక్ పిట్ లో గొడవ తో ప్రయాణికులకు అనుమానం వచ్చింది. విమానం ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ప్రయాణికులు, కాక్ పిట్ సిబ్బందికి అప్రమత్తం అయ్యారు. వెంటనే కాక్ పిట్ తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. కో పైలెట్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయిల్ వెంటనే అప్రమత్తం అయ్యింది. ఇజ్రాయిల్ రక్షణ శాఖ ఫైటర్ విమానాలను రంగంలోకి దించింది. ప్రధాన మంత్రి బెంజిమెన్ నేతన్యాహు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు దుబాయ్ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. రెండూ దేశాల్లో సీరియస్ వాతావరణం నెలకొంది. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందోనని అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి విమానాన్ని సౌదీ అరేబియా లోని తబూక్ విమానాశ్రాయంలోకి సేఫ్ గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఇదంతా సాధారణంగా జరిగిన ఘటన కాదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒమెన్ దేశానికి చెందిన కో పైలెట్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. ఇజ్రాయిల్ ప్రయాణికులందరినీ ఒక్కసారిగా హతమార్చాలన్న కుట్రతోనే ఒమన్ కో పైలెట్ ఈ దాడికి పాల్పడినట్లు ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు, ఇజ్రాయిల్ రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను ప్రపంచ ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

This post was last modified on September 30, 2026 11:18 pm

Share

Recent Posts

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

41 minutes ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

ఎన్టీఆర్… ఇలాగే ఉండాలి

తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

6 hours ago