Political News

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌.. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. ద‌స‌రా రోజు పార్టీ పేరు ప్ర‌క‌టించే ఆలోచ‌నలో ఉన్నాన‌ని తెలిపారు. అదేస‌మ‌యంలో పార్టీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పాద‌యాత్ర చేసి. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటాన‌ని, వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటాన‌ని చెప్పారు. త‌న పాద‌యాత్ర షెడ్యూల్‌ను కూడా వెల్లడిస్తాన‌న్నారు.

జ‌గ‌న్‌కుపోటీనే..

వ‌చ్చే ఏడాది నుంచి పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌కు సాయిరెడ్డి పాద‌యాత్ర ప్ర‌ధాన పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల సింప‌తీని గెయిన్ చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడు సాయిరెడ్డి కూడా ఇదే యాత్ర‌కు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కూడా ఆమ‌ధ్య తాను కూడా పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పిన విష‌యం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ రెండు ప‌రిణామాలు కూడా.. జ‌గ‌న్‌కు పోటీనే ఇవ్వ‌నున్నాయి.

ఇక‌, విశాఖ‌ను రాజ‌ధానిగా చేస్తాన‌ని జ‌గ‌న్ చెప్పార‌ని.. ఇక్కడివారిని నమ్మించార‌ని సాయిరెడ్డి చెప్పారు. కానీ, ఆ త‌ర్వాత మావిగ‌న్ అంటూ కొత్త రాగం అందుకున్నార‌ని చెప్పారు. ఈ విష‌యంలో విశాఖ ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ మోసం చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో వారికి సారీ చెప్పాల‌ని జ‌గ‌న్‌ను డిమాండ్ చేశారు. వ్య‌క్తిగ‌తంగానే కాకుండా.. రేపు పెట్ట‌బోయే పార్టీ ప‌రంగా కూడా.. తాము అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చూస్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అనుకూల‌మైన న‌గ‌రం అమ‌రావ‌తిగా ఉంటుంద‌న్నారు.

అదేస‌మ‌యంలో మూడు ప్రాంతాల అభివృద్ధికి త‌మ వంతు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని రాజ‌కీయాలు.. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని పాల‌న‌ను తాము అందిస్తామ‌ని చెప్పారు. ఇక‌, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చెబుతున్న‌ట్టుగా రెడ్డి వ‌ర్గానికి, క‌మ్మ వ‌ర్గానికి ముఖ్య‌మంత్రి పీఠం ప‌రిమితం అవుతోంద‌ని అన్నారు. కానీ, తాము అధికారంలోకి వ‌స్తే.. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు ముఖ్యంగా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

This post was last modified on September 30, 2026 11:43 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

16 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

38 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

55 minutes ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

5 hours ago