తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్నుంచి అభిమానులు టెన్షన్ పడుతూ.. మళ్లీ తమ హీరో ఎప్పుడు బయట కనిపిస్తాడో అని ఎదురు చూస్తున్నారు. ఐతే మంగళవారం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తారక్ హాజరు కావడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.
వాళ్లను మరింత సంతోషపెట్టిన విషయం.. తారక్ చాలా ఏళ్ల తర్వాత చాలా ఉత్సాహంగా, సరదాగా, అల్లరి చేస్తూ ఈ ఈవెంట్లో సందడి చేయడం. ఒకప్పుడు తారక్ తన సినిమాల వేడుకల్లో, అలాగే వేరే వాళ్ల ఈవెంట్లలో చాలా సరదాగానే ఉండేవాడు. కానీ వయసు పెరగడం వల్ల వచ్చిన పరిణతి వల్లో.. తండ్రి మరణం వల్లో కానీ.. ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయాడు.
ఈ సీరియస్‌నెస్ తాత్కాలికమే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అది ఏళ్ల పాటు కొనసాగింది. సినిమా వేడుకల్లో నవ్వడం కూడా తగ్గించేసి, ముభావంగా కనిపిస్తూ, ప్రసంగాల్లో కూడా సీరియస్‌నెస్ చూపించడం పట్ల చాలామందిలో అసంతృప్తి వ్యక్తమైంది. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అంత సానుకూలంగా లేరు.
మళ్లీ తారక్‌లో మునుపటి జోష్ చూడాలని వాళ్లు కోరుకున్నారు. ఐతే ఎవరైనా ఈ మేరకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారా.. లేక తనే అర్థం చేసుకున్నాడా తెలియదు కానీ.. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ఈవెంట్లో మునుపటి అల్లరి తారక్‌ను చూసే అవకాశం దక్కింది. ఆడిటోరియంలో అడుగుపెట్టగానే బారికేడ్ దూకి రమ రాజమౌళిని ఆత్మీయంగా కౌగిలించుకోవడం దగ్గర మొదలుపెడితే.. ఈ ఈవెంట్లో తారక్ జోష్ మామూలుగా లేదు.
మైత్రి రవిశంకర్ తనను కోట్ చేస్తూ ఏదో మాట్లాడుతుంటే.. సరదాగా తిట్టడం.. ‘వారణాసి’ నిర్మాత కేఎల్ నారాయణతో పరాచకాలాడడం.. రాజమౌళితో కలిసి నవ్వుతూ తుళ్లుతూ కనిపించడం.. అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం.. ఇలా అన్నీ చూసేవాళ్లకు ముచ్చటగా అనిపించాయి. ప్రసంగంలో మొదట కొంత సీరియస్‌నెస్ ఉన్నప్పటికీ.. తర్వాత సరదాగానే మాట్లాడాడు. తారక్ ఇలాగే ఉండాలని.. ఈ జోష్ అభిమానుల్లో తెచ్చే ఉత్సాహమే వేరని.. ఇకముందే ఇదే కంటిన్యూ చేయాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 30, 2026 11:21 pm
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…