Trends

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం తీరాక‌.. వారికి చేయాల్సిన క‌ర్మ‌లు చేసి.. రుణం తీర్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌క త‌ప్ప‌దు. కానీ, ముంబైకి చెందిన ఓ మ‌హిళ త‌న తండ్రిపై ఉన్న ప్రేమ‌తో ఆయ‌న మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా మృత‌దేహాన్ని అలానే భ‌ద్ర ప‌రుచుకుని ఉంచేసింది. 2022లో చ‌నిపోయిన పెద్దాయన మృత దేహాన్ని ఫ్రీజ‌ర్‌బా క్సులో ఉంచిన ఘ‌ట‌న తాజాగా వెలుగు చూసింది.

ముంబై వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఓ ఇంటి నుంచి నాలుగు రోజులుగా తీవ్ర దుర్వాస‌న‌లు వెలువ‌డుతున్నా యి. దీంతో చుట్టుప‌క్క‌ల వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసుల‌కు.. ఇంటి ముందు “డేకేర్ సెంట‌ర్‌ త్వ‌ర‌లో ప్రారంభం` అని రాసి ఉంది. దీంతో అవాక్క‌య్యారు. అనంత‌రం.. తాళం ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి ప్ర‌వేశించి చూడ‌గా.. ఫ్రీజ‌ర్ బాక్సులో ఉన్న పెద్దాయన మృత దేహం క‌నిపించింది. దీంతో వివ‌రాలు సేక‌రించి.. ఆయ‌న కుమార్తును రప్పించారు.

నాకు మానాన్న అంటే ప్రాణం.. అందుకే ఆయ‌న మ‌రణించ‌లేద‌ని భావిస్తున్నా.. ఆ దేహం నాతోనే ఉండాలి అని ఆమె జ‌వాబు ఇచ్చింది. అమెరికాలో మృత దేహాల‌ను ఏళ్ల త‌ర‌బ‌డి నిల్వ చేసే సంస్థ‌ను సంప్ర‌దించి.. వారు చెప్పిన‌ట్టే పాటిస్తున్నానని ఆమె తెలిపారు. త్వ‌ర‌లోనే మృత దేహాన్ని అమెరికాకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్న‌ట్టు వివ‌రించారు. కానీ, చుట్టుప‌క్క‌ల వారి ఫిర్యాదు మేర‌కు మృత‌దేహాన్ని సంప్ర‌దాయ రీతిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని పోలీసులు కోరారు. దీనికి ఆమె స‌సేమిరా అన‌డంతోకేసు న‌మోదు చేసి.. మృత‌దేహాన్ని మార్చురీకి త‌ర‌లించారు.

కొత్త కాదు..

మ‌న దేశంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చుగా వెలుగు చూస్తున్నాయి. అయితే.. ఇన్ని సంవ‌త్స‌రాలు కాదు కానీ.. రోజుల త‌ర‌బ‌డి త‌మ వారి మృత‌దేహాల‌ను ఇళ్ల‌లోనే ఉంచుకుంటున్న‌ట్ట ఘ‌ట‌న‌లు ఉన్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలో త‌ల్లి మృత దేహాన్ని 22 రోజుల పాటు కుమార్తెలు ఇంట్లోనే ఉంచుకున్నారు. ప‌లు ర‌సాయ‌నాలు పూసి దానిని కాపాడుకున్నారు. కానీ, చివ‌ర‌కు వెలుగు చూడ‌డంతో పోలీసులు అంత్య‌క్రియ‌లు చేశారు. గుంటూరు, నెల్లూరు, వ‌రంగ‌ల్, చెన్నైల‌లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి.

కోర్టు తీర్పులు..

మృత దేహాల‌ను నిల్వ చేసుకునే విష‌యంపై కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. గ‌రిష్ఠంగా 10 నుంచి 20 రోజుల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో మృత దేహాల‌ను నిల్వ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. వీటిని ప్ర‌భుత్వ మార్చురీల్లోనే ఉంచాలి. వైద్య ప‌ర‌మైన‌, అనుమానాస్ప‌ద ఘ‌ట‌న‌ల విష‌యంలో ఈ ప‌రిమితి లేదు. ఇలా.. కొన్ని నెల‌లు భ‌ద్ర ప‌రిచే అవ‌కాశం ఉంది.

This post was last modified on September 30, 2026 11:39 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

13 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

39 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

56 minutes ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

5 hours ago