టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో తాజాగా బుధవారం సాయంత్రం.. ప్రజా పాలన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చింది ఎవరని నిలదీశారు. ఇక్కడి చేనేత కార్మికులకు కేటీఆర్ ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. ఆరు సార్లు గెలిచిన ఆయన.. అణాపైసా అయినా చేనేతలకు, రైతులకు ఖర్చు చేశారా? అని నిలదీశారు.
దిగుమతి చేశారు..
అమెరికాలో చదువు సంస్కారం లేకుండా తిరుగుతున్న కేటీఆర్‌ను.. తీసుకువచ్చి కేసీఆర్ సిరిసిల్ల టికెట్ ఇచ్చారని రేవంత్ వ్యాఖ్యానించారు. దిగుమతి సరుకుకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఇక్కడ ఆయనకు వరుసగా టికెట్ ఇచ్చి గెలిపిస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే నిజాం నవాబుకు ఎంత ధనం ఉందో.. ఇప్పుడు కేటీ ఆర్‌కు కూడా అంతే ఉందని అన్నారు. ఇదంతా ..ఎవరిదని ప్రశ్నించారు. సిరిసిల్ల ప్రజలు ఎంతో నమ్మకంతో తమకేదైనా చేస్తారని నమ్మి ఓట్లు వేస్తే.. దానిని కేటీఆర్ తన రాజమార్గంగా వాడుకుని సొమ్ములు సంపాయించుకున్నారని అన్నారు.
ఫామ్ హౌస్‌ల లెక్క తేలుస్తాం..
కేసీఆర్.. కేటీఆర్ ఫాం హౌస్‌ల లెక్క తేలుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే విచారణకు కమిటీలను కూడా నియమించామన్నారు. వాటిని ఊరికేనే వేయలేదని.. మాటలు చెప్పలేదని అన్నారు. వందల ఎకరాల ఫాం హౌస్‌లు ఎక్కడనుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో లెక్క తేలుస్తామన్నారు. సిరిసిల్ల చేనేతకు దేశంలోనే మంచి పేరుందన్న సీఎం.. ఇక్కడ, చేనేతలు… ఆత్మ హత్య చేసుకుంటుంటే.. కేటీఆర్ ఫార్ములా రేసులు ఆడి సొమ్ము గడించారని విమర్శించారు. సామాజిక సమస్యలకు కూడా సిరిసిల్ల కేంద్రంగా మారిందన్నారు.
మా జోడీకి తిరుగులేదు..
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి జోడీకి తిరుగులేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు ఈ మాటే చెబుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడీని బద్దలు కొడదాం. సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం. ఇదే కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిజ్ఞ. అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు చోటు లేదని.. ఇక పాలనంతా కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం.
This post was last modified on September 30, 2026 9:53 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…