ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం కుటుంబ యూనిట్. తమిళ మలయాళంలో తీసినప్పటికి ఇతర బాషల ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రాలు రెండు కలిపి ఇప్పటిదాకా అయిదు వందల కోట్లు దాకా కొల్లగొట్టాయి. వీటి హీరోలు సూరి, నివిన్ పౌలి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాంటిది ఈ టైంలో ఇద్దరూ కలిసి నటించిన ఒక మూవీ వస్తోందంటే ఖచ్చితంగా దాని మీద అంచనాలు ఉండాలి.
కానీ పరిస్థితి దానికి రివర్స్ లో ఉంది. 2024 సంవత్సరం అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గా పేరొందిన రామ్ తీసిన ‘ఏళు కడల్ ఏళు మలై’ విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఇందులో సూరి, నవీన్ పౌలి నటించారు. అంజలి హీరోయిన్. 53వ రాట్లర్ డామ్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ చేస్తే వివిధ దేశాల విమర్శకుల ప్రశంసలందుకుంది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా పాటలు రెండేళ్ల క్రితమే వచ్చాయి. రకరకాల కారణాలు థియేటర్ కు రాకుండా ఆపాయి.
ఇప్పుడీ ఏళు కడల్ ఏళు మలై తెలుగులో ‘సంచారి’ పేరుతో డబ్బింగ్ జరుపుకుని ఒకేసారి సమాంతరంగా రేపు రిలీజ్ కానుంది. విచిత్రంగా దీని గురించి ఎలాంటి సౌండ్ లేదు. ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయలేదు. బుకింగ్స్ యాప్ తెరిచి చూస్తే తప్ప ఇది ఉందనే సంగతి తెలియడం లేదు. మూడు పదుల వయసున్న ఒక యువకుడికి, ఎనిమిది వేల సంవత్సరాల వెనుకటి ఒక రాతి మనిషికి మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. పాయింట్ చూస్తుంటే వెరైటీగానే ఉంది.
ఏది ఏ టైంలో జరగాలో ఆ టైంకి జరిగిపోవాలి. లేదంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. సంచారికి గట్టి పోటీ ఉంది. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, సిగ్మా, తెల్లకాగితం, డోరతీ, ఎస్ఐ యుగంధర్ అంటూ బాక్సాఫీస్ మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఇలాంటి టైంలో సంచారి ఏ మాత్రం సౌండ్ చేస్తుందో చూడాలి. మండాడి పుణ్యమాని సూరికి, బెత్లెహాం వల్ల నివిన్ పౌలికి క్రేజీ సక్సెస్ వచ్చిన టైంలో ఇప్పుడీ సంచారి ఎలాంటి ఫలితం ఇస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on September 30, 2026 7:18 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…