Movie News

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్, కాంతార ఆ యుఫోరియాని ఎంజాయ్ చేసి వందల కోట్ల వసూలు చేశాయి. అంతే స్థాయిలో జైలర్ 2 మీద కూడా హైప్ వస్తుందని రజనీకాంత్ అభిమానులు భావించారు. అయితే అక్టోబర్ 15 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నుంచి సాలిడ్ కంటెంట్ బయటికి రావాల్సి ఉంది. హైప్ పెరగాలన్నా, జనాన్ని ఊపేయాలన్నా ఇది చాలా అవసరం.

ఈ బాధ్యతని అనిరుధ్ రవిచందర్ తీసుకోవాలి. కానీ మొత్తం పాటలు జ్యుక్ బాక్స్ రూపంలో వచ్చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్ కాలేకపోతోంది. మొదటి భాగాన్ని మించిపోయే స్కోర్ ఉంటుందని మ్యూజిక్ లవర్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వన్ సన్ వన్ మూన్ సహా ఇంకా ఏ సాంగ్ భారీ చార్ట్ బస్టర్ అనిపించుకోలేకపోయాయి. పైగా ప్రోమోల్లో ఏఐ కంటెంట్ వాడటం జనం హర్షించలేకపోతున్నారు. దీని సంగతలా ఉంచితే జైలర్ 2 చేతిలో కేవలం రెండు వారాలు టైం ఉంది.

వచ్చే వారం ట్రైలర్ లాంచ్ జరగనుంది. చెన్నైలో ఎప్పుడూ చేసే తరహాలో ఈసారి ఆడియో వేడుక ఉండకపోవచ్చని టాక్. సెక్యూరిటీ కారణాలుగా పైకి చెబుతున్నప్పటికీ విజయ్ ప్రభుత్వం ఉంది కాబట్టి అనుమతులు అంత ఈజీగా రావనేది ఒక వర్గం చేస్తున్న కామెంట్. ఒకవేళ నిజంగా అడిగితే విజయ్ కాదనకపోవచ్చు. తెలుగులో మటుకు ఎలాంటి వేడుకలు ఆశించలేం. నేరుగా థియేటర్స్ లోనే చూడాలి. ఒకప్పుడు రజని రెగ్యులర్ గా హైదరాబాద్ వచ్చేవారు కానీ ఇప్పుడు తగ్గించారు.

ఇప్పటికి బజ్ ఎలా ఉన్నా ట్రైలర్ తర్వాత లెక్కలు మారిపోతాయని టీమ్ నమ్మకంగా ఉంది. ఇది గొప్ప సక్సెస్ కావడం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు చాలా ముఖ్యం. నెక్స్ట్ చేయబోయే కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్ మీద ఎలాంటి నెగటివ్ ప్రభావం ఉండకూడదనుకుంటే జైలర్ 2 సాలిడ్ బ్లాక్ బస్టర్ అయ్యేలా చేయాలి. పాత క్యాస్టింగ్ తో పాటు అదనంగా నటీనటులు తోడైన జైలర్ 2లో హృతిక్ రోషన్ స్పెషల్ క్యామియో ఈసారి చాలా ప్రత్యేకంగా నిలవనుందని ఇన్ సైడ్ టాక్

This post was last modified on September 30, 2026 7:12 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

5 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago