Trends

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ గిల్ 223 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 133 బంతులు ఎదుర్కొన్న అతడు చివరి వరకు క్రీజులో ఉండి భారత్‌ను గెలిపించాడు. మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌పై 208 చేసిన గిల్.. ఇప్పుడు మరోసారి డబుల్ సెంచరీ అందుకున్నాడు.

వన్డే క్రికెట్‌లో ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన బ్యాటర్ ఇప్పటివరకు రోహిత్ శర్మ మాత్రమే. రోహిత్ ఖాతాలో మూడు ఉన్నాయి. ఇప్పుడు రెండు డబుల్ సెంచరీలతో గిల్ కూడా ఆ లిస్ట్‌లో చేరాడు. అంటే మరోసారి 200 కొడితే రోహిత్ రికార్డును సమం చేస్తాడు. గిల్ వయసు, ఇంకా ముందున్న కెరీర్‌ను చూస్తే ఈ రికార్డు బ్రేక్ చేయడం ఖాయం.

ఇక్కడ మరో రికార్డు కూడా గిల్ ఖాతాలో పడింది. 117 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. వన్డే చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. గతంలో ఇషాన్ కిషన్ 126 బంతుల్లో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ చేశాడు. ఆ రికార్డును గిల్ ఏకంగా తొమ్మిది బంతుల తేడాతో దాటేశాడు. అంతకుముందు 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఆ తర్వాత కూడా అదే స్పీడ్ కొనసాగించాడు.

గిల్ తొలి డబుల్ సెంచరీ 2023 జనవరి 18న హైదరాబాద్‌లో వచ్చింది. న్యూజిలాండ్‌పై ఆ మ్యాచ్‌లో 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా వేరు. అప్పుడు భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే.. ఇప్పుడు 406 పరుగుల టార్గెట్‌ను వెంటాడుతూ ఈ ఇన్నింగ్స్ వచ్చింది.

పైగా గిల్‌కు ఇది వరుసగా రెండో వన్డే సెంచరీ. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 110 పరుగులు చేసిన అతడు, గువాహటిలో దాన్ని డబుల్ సెంచరీ వరకు తీసుకెళ్లాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడి వన్డే సెంచరీల సంఖ్య 11కు చేరింది. భారత్‌లో ఆడిన గత మూడు వన్డేల్లోనూ గిల్ సెంచరీ చేయడం మరో విశేషం. సిరీస్‌లో ఇంకా మూడో వన్డే మిగిలి ఉండటంతో ఇప్పుడు గిల్ బ్యాటింగ్‌పైనే మరోసారి ఫోకస్ పడనుంది.

This post was last modified on September 30, 2026 11:04 pm

Share

Recent Posts

రజినీ అంటే పిచ్చి… స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే?

ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…

2 hours ago

టైగర్‌పై దాడి… విదేశాల్లో ఉద్యోగం!

రెండు రోజుల కిందట ముంబయి వీధుల్లో జనం అంతా చూస్తుండగా.. టైగర్ ష్రాఫ్ లాంటి పేరున్న బాలీవుడ్ నటుడి మీద…

3 hours ago

తాగి పాట పాడిన లెజెండ‌రీ సింగ‌ర్?

ద‌లేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగ‌ర్. తుణుక్ తుణుక్ తున్.. స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్…

4 hours ago

యష్ ముందే చెప్పడం సరికాదేమో

నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…

5 hours ago

తెలంగాణ‌కు ప్రకృతి విపత్తులా మారిన ఎల్‌నినో

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫ‌లితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెల‌కొంది. రాబోయే 6 నుండి…

5 hours ago

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన…

6 hours ago