సొంత చెల్లెలి పై.. అత్యాచారానికి పాల్పడిన అన్నలు ..!

తనకు తోడ బుట్టిన చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనకు పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాల్సిన అన్నలే ఆ బాధ్యతను మరిచిపోయి సొంత చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత చెల్లెలినే శారీరకంగా లోబర్చుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ నరకం చూపిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు చిన్నప్పుడే తండ్రి వదిలి వెళ్లిపోవడంతో తల్లి, చెల్లి బాధ్యత తానే చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన చెల్లి పై కన్నువేసిన అన్న శారీరకంగా తనను లోబర్చుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తనపై తన అన్న చేస్తున్న అఘాయిత్యాన్ని తన తల్లికి చెప్పిన పట్టించుకోకపోవడంతో తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది.

పెద్దమ్మ ఇంటికి వెళ్లినప్పటికీ ఆమెకు ఈ నరకం తప్పలేదు. అక్కడా ఆమె కొడుకు నరకం చూపిస్తున్నాడు.ఈ విషయాన్ని తల్లికి, పెద్దమ్మకు చెప్పిన పట్టించుకోకపోవడంతో ఆమె తన స్నేహితులకు, ఉపాధ్యాయులకు చెప్పి పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది. ఈ విషయం బయట చెబితే చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె తల్లి, పెద్దమ్మ, ఆమె భర్త కుమారుల పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.