Political News

మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి సారూ…?

కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి సారూ.. అంటూ మాజీ మంత్రిని ఓ వ్యక్తి ఫోన్లో అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి, పలకడానికి కొత్తగా అనిపించిన ఈ పదం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్, సెటైర్లు, జోకులు హోరెత్తిస్తున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మొదటిసారిగా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన మీడియా సమావేశంలో’మావిగన్’ అనే పదాన్ని ప్రస్తావించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ రూ.15,000 నుంచి 20,000 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ ‘మావిగన్’ కారిడార్‌ను ఆయన ప్రత్యామ్నాయ రాజధానిగా తెరపైకి తెచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరమని, అభివృద్ధి చెందిన నగరాలను కలుపుకుంటే మౌలిక వసతులు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఆయన వాదించారు. వచ్చే ఎన్నికల్లో మావిగని అజెండాగా ఎన్నికలకు వెళ్తామని ఈమధ్య తెల్చి చెప్పారు.

అయితే సోషల్ మీడియాలో దీనిపై ట్రోల్స్ వచ్చాయి. మావిగన్’ వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా పేరులా, కొత్త రకం తుపాకీ (Gun) పేరులా ఉందంటూ నెటిజన్లు జోకులు వేశారు. గతంలో అమరావతిని గ్రాఫిక్స్ అన్నవాళ్లు, ఇప్పుడు మూడు నగరాల పేర్లను కలిపి ‘షాట్‌కట్ స్పెల్లింగ్’ రాజధానిని తెచ్చారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

కాగా, మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కు ఓ వ్యక్తి కాల్ చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి జోగి రమేష్‌కు ఫోన్ చేసి, “సార్, నేను మావిగన్ వెళ్ళాలి.. ఏ బస్సు ఎక్కాలి? ఏ స్టాండ్‌లో దిగాలి?” అని వ్యంగ్యంగా అడిగారు. అది ఒక ప్రాంతం కాదు, మూడు నగరాల కలయిక. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక నువ్వే స్వయంగా మావిగన్ కారిడార్‌ను చూస్తావు” అని రమేష్ సమాధానమిచ్చారు. ఈ సంభాషణ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.

This post was last modified on July 8, 2026 5:47 am

Share

Recent Posts

5 నెలల టికెట్ ఉన్నా… అమెరికాలో 2 నెలలే ఉండమన్నారు!

హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…

3 minutes ago

మోదీ ఈవెంట్‌కు కూడా బుక్‌మైషో టికెట్లా…

సినిమా చూడాలంటే బుక్‌మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…

6 minutes ago

సుకుమార్ మీద ఒక బుక్కు

ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది అంటే మరో మాట లేకుండా సుకుమార్ పేరు చెప్పేయొచ్చు. టాలీవుడ్లోనే…

5 hours ago

విజయ్ జయలలిత పేరు ఎందుకు చెప్పలేదు?

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…

12 hours ago

మనుషులను గోకుతూ.. నెలకు రూ.14 లక్షలు సంపాదిస్తున్నాడు!

ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…

12 hours ago

తెలంగాణా అసెంబ్లీలో బ్లాక్ డే

తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…

13 hours ago