సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు కూడా.. ఎప్పటికప్పుడు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. నేరాలు ఆగడం లేదు.. బాధితుల సంఖ్య తగ్గడం లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. తాజాగా విజయవాడలో 10 కోట్ల రూపాయలను సైబర్ ముఠా కొట్టేసింది. ఇది ఇప్పటి వరకు అంటే గత రెండేళ్లలో జరిగిన భారీ సైబర్ మోసాల్లో ఫస్ట్ అని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కోటి, రెండు కోట్ల వరకు మాత్రమే మోసాలు జరిగాయని తెలిపారు.
ఏం జరిగింది?
విజయవాడ కృష్ణలంకకు చెందిన ఓ రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్‌ను గత వారం రోజులుగా సైబర్ ముఠా ట్రాప్ చేస్తోంది. “నువ్వు అవినీతి పరుడివి. బాగా సంపాయించావు. నీపై పలు కేసులు ఉన్నాయి. అరెస్టు చేస్తున్నాం“ అంటూ బెదిరించడంతో ఆయన భయపడి పోయారు. పైగా.. తాము సీబీఐ, ఈడీ అంటూ.. వరుసగా రెండు మూడు రోజుల పాటు బెదిరించే సరికి.. ఆయన ఎవరికిచెప్పుకోవాలో తెలియక.. వారినే అనుసరించారు. దీంతో డిజిటల్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. ఈడీ, సీబీఐ ఉన్నతాధికారుల పేర్లు వినియోగించి బెదిరించారు.
ఈ క్రమంలో కేసులు ఎత్తేసేందుకు తమకు సొమ్ముకావాలని డిమాండ్ చేశారు. విషయం వెనుకున్న నేరాన్ని గుర్తించే పరిస్థితిలో లేని ఇంజనీర్.. నేరస్తులు చెప్పినట్టు చేశారు. మరోవైపు.. ఫొటోలు బయట పెడతామని, సోషల్ మీడియాలో అవినీతిని వెలుగులోకి తీసుకువస్తామని కూడా బెదిరించినట్టు బాధిత ఇంజనీర్ చెబుతున్నారు. దీంతో చేసేది లేక.. వారు చెప్పినట్టుగానే.. 10 కోట్ల రూపాయలను కెనరా బ్యాంకు ఖాతాలో వారు చెప్పిన నెంబరుకు వేశారు. ఇలా.. రెండు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అయితే.. ఇది జరిగిన మరుసటి రోజు కూడా నేరస్తులు ఫోన్ చేసి.. మరింత డబ్బుకావాలని అనడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
7 కోట్లు సేఫ్!
కాగా.. నేరస్తులు దోచుకునే ప్రయత్నం చేసిన 10 కోట్ల రూపాయల్లో పోలీసులు హుటాహుటిన 7 కోట్లను నిలుపుదల(ఫ్రీజ్) చేశారు. దీంతో ఆ సొమ్ము నేరస్తుల ఖాతాల్లోనే నిలిచిపోయింది. ఇది వెనక్కి వస్తుందా? లేదా? అనేది తర్వాత కానీ చెప్పలేని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. ఇక, విశ్రాంత ఇంజనీర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితులని.. అంటున్నారు. కానీ, ఆయన పేరు వెల్లడించలేదు. ఇలాంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
This post was last modified on September 30, 2026 9:27 am
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీసీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల జోడీకి ప్రజల్లో మరింత ఆదరణ…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…