తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో ఏ సర్టిఫికెట్ వచ్చిందన్నారు. జూలై 23 విడుదలంటూ పోస్టర్లు కూడా తయారు చేశారు. కట్ చేస్తే నిర్మాణ సంస్థ అదేం లేదని కొట్టి పారేస్తోంది. సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అప్పటిదాకా వేచి చూడమని చెబుతోంది. ఇక్కడితో అయిపోతే ట్విస్టులు ఏముంటాయి.
జన నాయకుడు ఎప్పుడు విడుదలైనా, బెనిఫిట్ షో మొదలుపెట్టి ఏ రోజైనా దీని టికెట్లు సాధారణ ధరలకే అమ్మాలని, బ్లాక్ లో అమ్మడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లకు చట్టప్రకారం శిక్ష విధించాలని, విజయ్ చెప్పినట్టు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు రెగ్యులర్ షోలు టీవీకే పార్టీ వేసినా సరే స్పెషల్ రేట్లు ఇచ్చే సమస్యే ఉందట. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఆయుధంగా వాడుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చేసే ప్లానట.
ఇందులో నిజమెంతుందో కానీ ఎక్స్ తదితర మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్లకు జూలై 23 విడుదల గురించి పక్కా సమాచారం ఉందని అందుకే ఇతర నిర్మాతలు ఎవరూ ఆ డేట్ కి వచ్చేందుకు సాహసం చేసే ఆలోచనలో లేరని ఇంకో న్యూస్ షికారు చేస్తోంది. ఈ సినిమా పైరసీ హెచ్డి ప్రింట్ కేసు కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. కోటికి పైగా ప్రేక్షకులు ఈ సినిమా చూసేశారని కెవిఎన్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
ఏది ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం వీలైనంత త్వరగా విడుదల చేయమని మొరపెట్టుకుంటున్నారు. తమ హీరో ముఖ్యమంత్రి అయ్యాక కూడా సినిమా ఇంత ఆలస్యం కావడం పట్ల వాళ్లలో అసహనం పెరుగుతోంది. నటుడిగా ఇదే తన చివరి చిత్రంగా విజయ్ ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇంకో మూవీ వచ్చే ఛాన్స్ లేదు. రజనీకాంత్, కమల్ హాసన్ లాగా పాలిటిక్స్ లో తడబడి ఉంటే ఏమయ్యేదో కానీ గెలిచేశారు కాబట్టి మేకప్ వేసుకునే అవకాశం రాదు.
This post was last modified on July 8, 2026 5:56 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…