ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కొందరు తల్లులు. మహారాష్ట్రలో ఓ అమ్మా నాన్న నెల రోజుల తమ బిడ్డను అమ్మేశారు. బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బులతో సెల్ ఫోన్, బంగారు నగలు కొన్నారు. ఈ ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ ముకుంద్‌వాడి ప్రాంతానికి చెందిన వందన, యోగేష్ కామ్రే అనే ఓ జంట కొద్ది రోజులుగా సహాజీవనం చేస్తున్నారు. ఇటీవల వారికి ఓ పండంటి బిడ్డ పుట్టాడు. బిడ్డను చూసి మురిసి పోవాల్సిన ఆ దంపతులు ఎంత లాభం వస్తుందని లెక్కలు వేసుకున్నారు. చివరికి లక్షా ఇరవై వేల రూపాయలకు సీమా రేశ్వాల్ అనే ఏజంట్ కు అమ్మేశారు. వచ్చిన డబ్బులతో ఒక్కొక్కటి 25 వేల రూపాయలు విలువ చేసే రెండు సెల్ ఫోన్లు, 62 వేల రూపాయలతో బంగారు నగ కొనుక్కొని సంతోష పడి పోయారు.
అయితే వీరి వద్ద బాబును కొనుగోలు చేసిన ఏజంట్ సీమా రేశ్వాల్ అ పసి బిడ్డను మరొకరికి అమ్మేసింది. పడేగావ్ కు చెందిన సంగీత అవ్హాడ్ అనే మహిళకు 2.7 లక్షలకు అమ్మేసింది. ఆమె ఆ బిడ్డని మరొకరికి విక్ర యించింది. నాందేడ్ లో వైద్యుడిగా చెలామణి అవుతున్న సురేష్ గుంటుక అనే వ్యక్తికి 3.5 లక్షలకు విక్రయించింది. ఆ నకిలీ వైద్యుడు బిడ్డను హైదరాబాద్ కు తరలించి అక్కడ ఉమా ఖట్కమ్ అనే మహిళకు విక్ర యించారు. ఇదంతా కేవలం నాలుగు రోజుల్లోనే జరగడం గమనార్హం. గుట్టుగా జరిగిన ఈ యవ్వారం ఎలా బయట పడిందంటే….
బిడ్డను కన్న వందన తన మీద దాడి జరిగిందని సెప్టెంబర్ 20 వ తేదిన ముకుంద్ వాడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ జరుగుతున్న సందర్బంలో బిడ్డ అమ్మకం సంగతి బయట పడింది. దాంతో పోలీసులు తీగ లాగారు. డొంక కదిలింది. కేవలం సెల్ ఫోన్ కోసం బిడ్డను అమ్ముకున్న వందన, యోగేష్ లను చూసి పోలీసులు బిత్తర పోయారు. నాలుగు రోజుల్లో నలుగురి చేతులు మారిన బిడ్డను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వాన్ని నిరూపించడమే కాదు దేశంలో పసి బిడ్డల అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో బట్టబయలు చేసింది.
This post was last modified on September 30, 2026 10:23 am
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీసీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల జోడీకి ప్రజల్లో మరింత ఆదరణ…