Movie News

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు వెళ్తున్నారు. స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తున్నారు. వంశీపైడిపల్లి తమిళంలో విజయ్ వారిసు తీశాక ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్ తో మాన్స్ టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను లాంటి యంగ్ డైరెక్టర్లు ఇదే బాటలో పయనించారు. ఇప్పుడీ లిస్టులో కొత్త పేరు చందూ మొండేటి తోడవ్వబోతోంది.

అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి కలయికలో రూపొందే సినిమాకు ‘మహాకాల్’ టైటిల్ నిర్ణయించినట్టు ముంబై నుంచి అందిన ప్రత్యేక సమాచారం. దీనికి కల్ట్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ కథను అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు. కొన్ని నెలల క్రితం చందూ మొండేటి అనౌన్స్ చేసిన యానిమేషన్ మూవీ వాయుపుత్ర ఈ లెక్కన పెండింగ్ లో ఉందని అనుకోవచ్చు. మహాకాల్ నేపథ్యం ఫాంటసీ, స్కై ఫై ఎలిమెంట్స్ తో ఉంటుందని సమాచారం.

తండేల్ సూపర్ హిట్ అయ్యాక చందూ మొండేటి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలు స్క్రిప్టుల మీద వర్క్ చేస్తూ ఫైనల్ గా తన బాలీవుడ్ ప్రయాణానికి పునాది వేసుకున్నారు. కార్తికేయ 2 వల్ల చందూకి నార్త్ సర్కిల్స్ లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు మహాకాల్ బిజినెస్ కి అది ఉపయోగపడనుంది. అక్షయ్, రానా పాత్రల్లో ఎవరు హీరో ఎవరు విలన్ అనేది బయటికి రాలేదు కానీ స్టోరీ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ టాక్.

త్వరలో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న మహాకాల్ వచ్చే ఏడాది చివరిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అఫీషియల్ గా ఇంకా ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ జరగలేదు కాబట్టి త్వరలోనే ఆ వివరాలు తెలియబోతున్నాయి. ప్రొడక్షన్ వైపు ఎక్కువ దృష్టి పెట్టి యాక్టింగ్ తగ్గించేసిన రానా దగ్గుబాటి ఈసారైనా పెద్ద బ్రేక్ అందుకుంటాడేమో చూడాలి. దండయాత్ర చేసినట్టు శరవేగంగా సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ కు ఇటీవలే హైవాన్ షాక్ ఇచ్చింది. అయినా స్పీడ్ విషయంలో తగ్గేదేలే అనడం ఈయన స్టైల్.

This post was last modified on September 30, 2026 3:40 pm

Share

Recent Posts

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

24 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

1 hour ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

5 hours ago