ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు కాకుండా మిగిలిపోయిన మొత్తం ఏకంగా రూ.20 వేల కోట్ల వరకు ఉందని సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. సుమారు రూ.45 వేల కోట్ల E-చలాన్లు జారీ చేస్తే, అందులో రూ.25 వేల కోట్లే వసూలయ్యాయి. మిగిలిన డబ్బును ఎలా రాబట్టాలనే విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గాలను ప్రస్తావించింది.
ఇందులో కరెంట్ బిల్లుతో చలాన్‌ను కలిపే ఆలోచన ఎక్కువగా హైలెట్ అయ్యింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ ఉంటే ఆ మొత్తాన్ని విద్యుత్ బిల్లుకు జత చేసే అవకాశం పరిశీలించాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సూచించింది. కరెంట్ బిల్లులను ప్రజలు తప్పనిసరిగా చెల్లిస్తారు కాబట్టి, వాటితో కలిపితే పెండింగ్ చలాన్ల వసూలు సులభమవుతుందనే కోణంలో ఈ సూచన వచ్చింది.
అయితే ఇకపై చలాన్ కట్టకపోతే కరెంట్ బిల్లులో వచ్చేస్తుందని కాదు. ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు చేసిన సూచన మాత్రమే.. అమల్లోకి ఇంకా రాలేదు. చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాల ఆర్సీ రెన్యువల్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్‌ను నిలిపివేయడం వంటి ఆప్షన్లు కూడా కోర్టు ప్రస్తావించింది. పరివాహన్ పోర్టల్‌లో వాహనాన్ని బ్లాక్‌లిస్ట్ చేయడం, ఫిట్‌నెస్ లేదా పీయూసీ సర్టిఫికెట్ల విషయంలో ఆంక్షలు పెట్టే అవకాశాలపైనా మాట్లాడింది.
2012 నుంచి సుప్రీంకోర్టులో కొనసాగుతున్న రోడ్డు భద్రత కేసు విచారణలో ఈ అంశం వచ్చింది. గతంలో రోడ్డు భద్రతపై ఇచ్చిన ఆదేశాల అమలు పరిస్థితిని కూడా కోర్టు ఇప్పుడు పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ఇచ్చిన ఆదేశాలు, వాటి అమలుకు ఇచ్చిన గడువు, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటనే వివరాలతో ఒక చార్ట్ సిద్ధం చేయాలని ధర్మాసనం కోరింది.
This post was last modified on September 29, 2026 12:59 pm
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…