Trends

శ్రీనగర్.. ఈ ఏడాది సమ్మర్ విన్నర్.. ఎంత భారీగా ఫ్లైట్ జర్నీలంటే?

ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్ కు భారీగా దేశీయ ప్రయాణికులు ఆసక్తి చూపటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విమానయానం ద్వారా దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల రద్దీ చూస్తే.. శ్రీనగర్ విజేతగా నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు పెరిగినప్పటికి.. ప్రయాణికులు మాత్రం పట్టించుకోకుండా ప్రయాణాలు జరిపిన వైనం ఆసక్తికరంగా చెప్పాలి. గ్లోబల్ ఏవియేషన్ డేటా అనలిటిక్స్ ఫ్లాట్ ఫామ్ (ఓఏజీ) తాజా నివేదికను చూస్తే.. ఈ ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.

టూరిస్టు పరంగా చూస్తే.. ఈ ఏడాది వేసవి విజేతగా శ్రీనగర్ నిలిచింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి శ్రీనగర్ కు వెళ్లే రూట్లలో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీ – శ్రీనగర్ రూట్లో అత్యధిక టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ రూట్ లో ప్రస్తుత సీట్ల సామర్థ్యం 2.08 లక్షలుగా చెప్పాలి. గత ఏడాది వేసవితో పోలిస్తే 35 శాతం అదనపు సీట్లను విమానయాన సంస్థలు పెంచటం విశేషం. దేశంలోనే అత్యధిక శాతం వృద్ధి ఈ రూట్ లోనే ఉన్నట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ – శ్రీనగర్ రూట్.. దేశంలోనే అత్యంత రద్దీ ఉన్న తొమ్మిదో మార్గంగా నిలిచింది. విమాన సర్వీసులు.. సీట్ల సామర్థ్యం రికార్డు స్థాయిలో పెరిగటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఢిల్లీ తర్వాత ముంబయి నుంచి శ్రీనగర్ కు అత్యధిక విమానసర్వీసులు.. సీట్ల సామర్థ్యం పెరిగిన రెండో రూట్ గా చెప్పాలి. మూడో స్థానంలో చండీగఢ్ నుంచి కూడా శ్రీనగర్ కు అత్యధిక పర్యాటకులు విమాన మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెప్పాలి. మరి శ్రీనగర్ కు అత్యధికంగా విమానాలు నడిపిన సంస్థగా ఇండిగో నిలిచింది.

దేశీయ మార్కెట్ లో 69 శాతానికి పైనే వాటా ఉన్న ఇండిగో.. ఈ వేసవిలో శ్రీనగర్ కు అత్యధిక విమానాలు నిలిపి నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానంలో ఎయిర్ ఇండియా గ్రూప్ నిలిచింది. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. ఎయిరిండియా సంస్థ తన అంతర్జాతీయ మార్గాల్ని తగ్గించుకొని శ్రీనగర్ లాంటి లాభదాయక పర్యాటక మార్గాల మీద ఫోకస్ చేసిన వైనం తాజా రిపోర్టు వెల్లడించింది. దీంతో నష్టాల్ని తగ్గించుకోవటంతో పాటు.. పెద్ద ఎత్తున సీట్ల అమ్మకాలు జరిపేందుకు అవకాశం లభించిందని చెప్పాలి.

మూడోస్థానంలో ఆకాశ ఎయిర్ నిలిచింది. ఢిల్లీ – శ్రీనగర్ రూట్ లో ఈ వేసవిలో 2.08 లక్షల సీట్లు అందుబాటులోకి రాగా.. 90 శాతానికి పైనే సీట్లు ముందస్తుగా బుక్ కావటం గమనార్హం.
గత ఏడాదితో పోలిస్తే ఢిల్లీ – శ్రీనగర్ విమాన టికెట్ల ధరలు 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు రూ.4-6 వేల వరకు టికెట్ల ధరలు ఉంటే.. ఈ వేసవిలో మాత్రం రూ.12-21 వేల వరకు టికెట్ల ధరలు పలికినట్లుగా చెప్పాలి. ముంబయి నుంచి శ్రీనగర్ కు వెళ్లే విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ వేసవిలో ఈ టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ.18వేలు.. గరిష్ఠంగారూ.27వేల వరకు పెరినట్లుగా వెల్లడైంది.

కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనటం ఈ రద్దీకి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో జూన్ చివరి నుంచి ప్రారంభయ్యే అమర్ నాథ్ యాత్ర రద్దీ కారణంగా విమాన సీట్ల సంఖ్య ముందస్తుగా పెరిగినట్లు చెప్పాలి. ఇక్కడో కీలక అంశాన్ని చెప్పాలి. అదేమంటే జూలై 1 నుంచి శ్రీనగర్ కు జర్నీ చేయాలని భావించే వారు ఎవరైనా సరే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సెప్టెంబరు 30 వరకు ప్రతి సోమవారం.. మంగళవారాల్లో శ్రీనగర్ విమాన సర్వీసుల్ని పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీనికి కారణం.. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో రన్ వే రిపేర్లు పెద్ద ఎత్తున జరుగుతుండటమే. ఈ నేపథ్యంలో ఇందుకు తగ్గట్లు తమ టూర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశీయంగా అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ దేశీయ రూట్లను చూస్తే.. ముంబయి – ఢిల్లీ మొదటిస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే నంబర్ వన్ రూట్ గా నిలిచింది. ప్రస్తుత సామర్థ్యం 6.58 లక్షల సీట్లుగా చెప్పాలి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొమ్మిది శాతం సీట్ల సామర్థ్యం పెరిగినట్లుగా వెల్లడైంది. అదే సమయంలో బెంగళూరు – ఢిల్లీ రెండో అత్యంత రద్దీ మార్గంగా నిలిచింది. ప్రస్తుత సామర్థ్యం 4.31 లక్షల సీట్లుగా చెప్పాలి. అయితే.. గత ఏడాది కంటే ఈ ఏడాది వేసవికి పెరిగిన డిమాండ్ కేవలం ఒక్క శాతం మాత్రమే.

మరోవైపు దేశీయంగా ఈ వేసవిలో డిమాండ్ తగ్గిన విమాన రూట్ల విషయానికి వస్తే.. బెంగళూరు – హైదరాబాద్ గా చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గుదల 15 శాతంగా నమోదైంది. రెండో స్థానంలో అహ్మదాబాద్ – ఢిల్లీ మధ్య కూడా 11 శాతం డిమాండ్ తగ్గినట్లుగా చెబుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సమ్మర్ సెలవుల్లో విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం లండన్ వైపు ఎక్కువ సీట్లను.. సర్వీసులను పెంచినట్లుగా చెప్పాలి.

ఢిల్లీ – లండన్ హీత్రూ మధ్య గత సమ్మర్ తో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ముంబయి – లండన్ హీత్రూ మద్య కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 12 శాతం ఎక్కువ సీట్ల సామర్థ్యం పెరిగింది. అదే సమయంలో ముంబయి – దుబాయ్ మధ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సీట్ల సామర్థ్యం 10శాతం తగ్గినట్లుగా చెప్పాలి. విమాన ఇంధన ధరల నేపథ్యంలో ఈ వేసవిలో ప్రధాన రూట్లలో విమాన టికెట్ల ధరలు 10 శాతం నుంచి 35 శాతం వరకు పెరిగాయి.

This post was last modified on June 16, 2026 6:25 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

2 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

4 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago