Trends

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. “మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే.. అన్యాయం జరిగితే నిలదీస్తాం, నిరసన తెలుపుతాం” అంటోంది నేటి యువత. మన దేశంలో వచ్చిన కాక్రోచ్ ఉద్యమం ఇందుకు ఉదాహరణ.

జెన్-జెడ్ యువత పలు దేశాల్లో ఇటువంటి వినూత్న పద్ధతుల్లోనే తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లో తాజాగా ముఖ్యమంత్రి నివాసం ముందే చెత్త పారబోసి యువత నిరసన తెలిపింది. మెరుగైన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రమైన వీధులు కావాలని యువకులు తమ డిమాండ్‌ను వినిపిస్తున్నారు.

నేపాల్‌లోని జనక్‌పూర్‌లో యువకుల బృందం వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. మెరుగైన చెత్త నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వీధులను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నివాసంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట చెత్తను పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రాంతాల్లో చెత్త సేకరణ, పారవేత సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించిన నిరసనకారులు, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వినూత్న నిరసన స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా నిలిచింది. చెత్త నిర్వహణలో లోపాలు, సరైన మౌలిక సదుపాయాల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 2025 సెప్టెంబరులో ప్రభుత్వం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ సహా ప్రధాన సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించడంతో యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా జెన్-జెడ్ యువత ముందుండి ఉద్యమాన్ని నడిపించడం విశేషంగా నిలిచింది.

This post was last modified on June 16, 2026 6:22 am

Share

Recent Posts

సీఎం గిఫ్ట్… 61 లక్షల మందికి కేకులు

బాలల దినోత్సవం అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఆరోజు పాఠశాలల్లో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంటుంది. అయితే…

25 minutes ago

సరదాగా చెప్పానంటున్న మల్లారెడ్డి కోడలు

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్…

45 minutes ago

పొత్తుల్లో భిన్నాభిప్రాయాలు సహజమే

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన…

10 hours ago

జనసేన నేతల పేరుతో మోసం… నిరుద్యోగులకు 7 కోట్ల టోపీ

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జనసేన కార్యాలయంలోని కీలక నాయకుల పేర్లతో ఓ వ్యక్తి నిరుద్యోగులను మోసం చేయడం కలకలం సృష్టిస్తోంది.…

11 hours ago

చంపేస్తాం అంటూ మాజీ సీఎంకు ఫోన్ కాల్

ఇటీవల కాలంలో లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆరాచకాలు ఎక్కువై పోతున్నాయి. నిన్నా మొన్నటిదాకా బాలీవుడ్ నటులను టార్గెట్ చేసిన ఈ…

13 hours ago

సీన్ నుంచి నేర్చుకోవాల్సింది స్క్రీన్‌ప్లేనే

పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి, సూపర్ సక్సెస్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతున్న సీన్ వసూళ్లు చాలా స్టడీగా…

13 hours ago