Trends

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా లేచి చూసే సరికి ఇంటి ఓనర్లు ఆ దొంగ చుట్టూ కర్రలు పట్టుకొని రెడీగా ఉండడం…ఇటువంటి సీన్లు సినిమాల్లో చాలా ఉన్నాయి. ఇదే తరహా సీన్ ఒకటి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా జరిగింది. హైదరాబాద్ లో గంజాయి మత్తులో దొంగతనానికి వెళ్లిన దొంగ అడ్డంగా దొరికిపోయిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

హైదరాబాబ్ లోని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాడి- ఏ-ముస్తఫా ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగతనం చేయాలని ఓ దొంగ అనుకున్నాడు. అయితే, ఆల్రెడీ గంజాయి కొట్టిన ఆ దొంగ మత్తులో ఉన్నానన్న సంగతి మరచిపోయినట్లున్నాడు. ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన దొంగ…ఆ తర్వాత మత్తులో చిత్తయి ఆ ఇంట్లోనే నిద్రపోయాడు. కట్ చేస్తే…ఈ లోపు ఇంటి ఓనర్లు వచ్చి గాఢ నిద్రలో ఉన్న దొంగను చూసి షాకయ్యారు. అతడి జేబులో తమ ఇంట్లోని బంగారు నగలు చూసి అవాక్కయ్యారు.

వెంటనే ఆ దొంగకు నిద్రాభంగం కలిగించిన ఇంటి యజమాని…ఆ దొంగ ఎవరు ఏంటి అని వాకబు చేశారు. గతంలో కూడా తమ ఇంట్లో మొబైల్ ఫోన్ చోరీ అయిందని ఆయన తెలిపారు. అయితే, తాను ఆ ఇంటికి సమీపంలోనే ఉంటానని, ఆ ఏరియావాడినేనని దొంగోడు సెలవిచ్చాడు. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ అన్ ప్రొఫెషనల్ దొంగను పోలీసులకు అప్పగించారు. ఇక, కుంభకర్ణుడి కజిన్ లా ఉన్న ఆ దొంగ ఇంకెన్ని ఇళ్లలో దొంగతనం చేశాడోనని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

This post was last modified on August 13, 2026 6:25 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

1 hour ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

3 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

4 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

6 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

6 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

8 hours ago