చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158 టీజర్ వాటిలో ముఖ్యమైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు కదిరి కాకాజీ టైటిల్ దాదాపు ఫిక్సని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. అయితే సంక్రాంతికి సినిమా విడుదల ఉంటుందా లేదానే సస్పెన్స్ మాత్రం ఇంకా వీగడం లేదు. దానికి కారణం విశ్వంభరని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట.
ఇప్పుడు విశ్వంభర ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి దసరాకు రావడం. అంటే జైలర్ 2 తో క్లాష్ అవుతూ అక్టోబర్ 16 దిగడం. రెండోది 2027 సంక్రాంతికి వెళ్లిపోవడం. అది కూడా మెగా 158 డ్రాప్ అయ్యే పక్షంలో. ఆల్రెడీ మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటికెట్టు జనవరి 12 డేట్ లాక్ చేసుకుని ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. కానీ విశ్వంభర బృందం ఎటూ తేల్చుకోలేక మీనమేషాలు లెక్కబెట్టడం ఫ్యాన్స్ లో విపరీతమైన అసహనాన్ని కలిగిస్తోంది.
ఒకవేళ విశ్వంభర రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ఏదైనా బర్త్ డేకి ఇచ్చే పనైతే దాని కౌంట్ డౌన్ లేదా కాస్త ఆసక్తి కలిగేలా ఏదైనా ప్రమోషనల్ మెటీరియల్ వదలాలి. కానీ అలాంటి సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. విఎఫ్ఎక్స్ విషయంలో విపరీతమైన ఆలస్యానికి గురైన ఈ ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ కాగా కీరవాణి సంగీతం సమకూర్చారు. ఒక స్పెషల్ సాంగ్ భీమ్స్ తో చేయించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు గౌరా హరికి ఇచ్చారనే టాక్ నెలల క్రితమే వచ్చింది.
ఏది ఏమైనా విశ్వంభర వెళ్తున్న దారి సరైన రీతిలో లేదు. యువి క్రియేషన్స్ కి కొరియన్ కనకరాజు రూపంలో మంచి హిట్టు దక్కింది. బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చనే ధీమా కలిగించింది. విశ్వంభర మీద తిరిగి బజ్ పెంచడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు కూడా నిర్లిప్తంగా ఉంటే కష్టం. ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ప్లాన్లు ఉండాలి. మన శంకరవరప్రసాద్ విడుదలైన ఏడు నెలల తర్వాత ఇంత మౌనంగా ఉండటం వెనుక అంతరార్ధం ఏమిటో మరి.
This post was last modified on August 16, 2026 11:38 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…