Movie News

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా అనుకున్నారు. కానీ విజయ్ గత దశాబ్ద కాలంలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి సూపర్ స్టార్ మించిన స్టార్ అయ్యాడు. ఐతే నంబర్ వన్ హీరోగా ఉంటూ ఫిలిం ఇండస్ట్రీని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్.

రాజకీయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోయి ఉంటే తిరిగి సినిమాల్లోకి వచ్చేవాడేమో కానీ.. అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడంతో విజయ్ మళ్లీ సినిమాల వైపు చూడడం కష్టమే. ఈ పరిస్థితుల్లో విజయ్ ఖాళీ చేసిన నంబర్ వన్ స్థానం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికీ రజినీ సినిమాల్లో కొనసాగుతున్నారు. ఆయనకు సరైన సినిమా పడితే రికార్డులు బద్దలువుతాయి. కానీ వయసు, ఆరోగ్యం రీత్యా ఆయన కెరీర్ చివరి దశలో ఉందన్నది వాస్తవం. రాబోయే కొన్నేళ్లలో ఆయన రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలే ఎక్కువ.

ఈ నేపథ్యంలో విజయ్ తర్వాత కిరీటం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. మామూలుగా అయితే అందరూ అజిత్ వైపు చూసేవారు. కానీ ఆయన కెరీర్ అంత గొప్పగా ఏమీ సాగట్లేదు. పైగా ఈ మధ్య అజిత్ బాగా సినిమాలు తగ్గించేశాడు. ఈ నేపథ్యంలో తల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి టైంలో అదను చూసి బాక్సాఫీస్ దగ్గర తన సత్తాను చూపిస్తున్నాడు సూర్య. వరుస ఫ్లాపుల నుంచి బయటపడి ఈ వేసవిలో ‘కరుప్పు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ విలక్షణ నటుడు. అది ఆయన కెరీర్లో తొలి 300 కోట్ల సినిమాగా నిలిచింది.

ఈ సినిమా రిలీజైన మూడు నెలలకే ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులేస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఇది క్లాస్ సినిమా అయినా సరే భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం కూడా కరుప్పు కలెక్షన్లకు దీటుగా నిలిచేలా ఉంది. వరుసగా రెండు భారీ విజయాలతో తమిళంలో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారుగా మారాడు సూర్య. అజిత్ తన కొత్త చిత్రం ‘డేర్ డెవిల్’తో సత్తా చాటకపోతే సూర్యనే తమిళ నంబర్ వన్ హీరో స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశముంది.

This post was last modified on August 16, 2026 11:01 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

18 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

58 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

1 hour ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

1 hour ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago