Movie News

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు పెట్టిన యష్ దానికి మించిన విజయాన్ని అందుకుంటానని ధీమాగా ఉన్నాడు. ప్రమోషన్లకు ఎక్కువ టైం లేకపోవడంతో వీలైనంత కెమెరా ముందుకు వస్తూ మీడియాలో హైలైటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కన్నడ తెలుగు తమిళ కంటే ఎక్కువగా యష్ ఫోకస్ హిందీ మీద ఉంది. అందుకే అక్కడి ప్రేక్షకుల దృష్టిలో మరింత బజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు.

ఇటీవలే జరిగిన ఒక టాక్ షోలో చాలా పరిణితితో కూడిన సమాధానాలు ఇవ్వడం జనాన్ని ఆకట్టుకుంటోంది. గతంలో రష్మిక మందన్న తన గురించి చేసిన నెగటివ్ కామెంట్స్, భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ, చరణ్ తారక్ లాంటి వాళ్ళు సాధించలేకపోయిన ప్యాన్ ఇండియా ఇమేజ్, టాక్సిక్ లో రొమాన్స్ కంటెంట్ ఇలా ఎన్నో విషయాలు చాలా బాలన్స్ గా ఎక్కడా తొట్రుపాటు లేకుండా చెప్పుకొచ్చాడు. యాంకర్ వివాదాస్పదంగా అడిగినా హుందాగా బదులు ఇచ్చాడు. వీటిలో కొన్ని మన హీరోల మనోభావాలు దెబ్బతీసినప్పటికీ అతడి వైపు తప్పు లేదు అనే అభిప్రాయమే అధికంగా వ్యక్తమవుతుంది.

ఇప్పుడీ మెచ్యూరిటీ యష్ కు అవసరం. ఎందుకంటే కాంట్రావర్సిలతో ఓపెనింగ్స్ రావొచ్చేమో కానీ సాధారణ జనం నుంచి మద్దతు దక్కాలంటే నిజాయితీ కనిపించాలి. అసలే టాక్సిక్ మీద కంటెంట్ పరంగా ప్రీ నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి. బోల్డ్ నెస్ ని హద్దులు దాటించారనే కోణంలో విమర్శలు లేకపోలేదు. వాటికి సమాధానం ఆగస్ట్ 26 దొరుకుతుంది కానీ అప్పటి దాకా ఇవి మరింత తీవ్రతరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత యష్ మీద ఉంది.

బజ్ సంగతి పక్కనపెడితే టాక్సిక్ అత్యవసరంగా శాండల్ వుడ్ పరిశ్రమకు ఆక్సీజన్ లా పని చేయాలి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అక్కడ సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. కెజిఎఫ్, కాంతార తప్ప వందల కోట్లు వసూలు చేసిన సినిమాలు లేవు. శివరాజ్ కుమార్, సుదీప్ లాంటి వాళ్ళు సైతం రెగ్యులర్ మూవీస్ తో బండి లాగిస్తున్నారు కానీ హై స్టాండర్డ్ లేవు. టాక్సిక్ కనక ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయితే కన్నడ ఇండస్ట్రీకి మరింత ఊపు వస్తుంది. సీనియర్లు ఆ నమ్మకంతోనే ఉన్నారు. 

This post was last modified on August 16, 2026 8:10 pm

Share

Recent Posts

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

41 minutes ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

1 hour ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

1 hour ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

2 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

2 hours ago

విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…

3 hours ago