చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్ ఉన్నా అది దిల్ రాజు ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎక్కువ శాతం ఆడియన్స్ ని చేరుకుంది అద్భుత విజయం సొంతం చేసుకుంది. దాని తర్వాత తెలంగాణ నేటివిటీలో ఎక్కువ చిత్రాలు రావడం మొదలయ్యింది. కానీ ప్రతిసారి ఆ మేజిక్ రిపీట్ చేయడం అంత సులభంగా ఉండటం లేదు. ఆ సిరీస్ లో వచ్చిందే పళ్ళబురుసు. మొన్న శుక్రవారం రిలీజయ్యింది.
తన బ్యానర్ తరఫున నాగార్జున ఈ మూవీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. స్వయంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొని విశేషాలు పంచుకున్నారు. నాగ్ తో పాటు సుప్రియ కూడా వీలైనంత పుష్ చేసింది. సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ సౌండ్ చేశారు. కానీ తీరా చూస్తే పళ్ళబిరుసుకి ఓపెనింగ్ రాలేదు. పబ్లిక్ టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం ఉన్న కాసిన్ని థియేటర్లను కూడా నింపలేకపోతోంది. అయితే లెక్క ఎక్కడ తప్పిందో చూద్దాం.
పళ్ళబురుసులో హీరోలు లేరు. క్యారెక్టర్ ఆర్టిస్టులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ మీదే కథంతా నడుస్తుంది. క్లైమాక్స్ లో మంచి ఎమోషన్ పెట్టారు కానీ ముందు జరిగిన కథా కథనాలను ఆశించిన స్థాయిలో తెరకెక్కించలేకపోవడంతో అధిక శాతం భారంగా సాగుతుంది. ఎంత క్లీన్ గా ఉన్నా జెన్ జీతో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కి కావాల్సిన కనీస ఎంటర్ టైన్మెంట్, ఛార్ట్ బస్టర్ సాంగ్స్ ఇందులో మిస్ కావడం టాక్ మీద ప్రభావం చూపించింది.
అసలు రిస్క్ ఇది కాదు. విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి హైప్ ఉన్న సినిమాతో నేరుగా క్లాష్ కావడం పళ్ళబురుసుకి డ్యామేజ్ చేసింది. దానికి తోడు బాలీవుడ్ మూవీ ఆవారాపన్ 2 స్ట్రాంగ్ గా ఉండటం, కొరియన్ కనకరాజు, డిసి మళ్ళీ పికప్ కావడంతో ఇతర సినిమాల వైపు ఆడియన్స్ కన్ను వేయడం లేదు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ మా దాంట్లో ఉందనే నమ్మకాన్ని పళ్ళబురుసు టీమ్ కలిగించలేకపోయింది. రేపటి నుంచి బాక్సాఫీస్ వద్ద ఎదురీతే ఉండొచ్చు.
This post was last modified on August 16, 2026 10:36 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…