Movie News

ఇరుముడి… పెద్ద పెద్ద స్టేట్మెంట్లు

త‌మ సినిమాల విడుద‌ల‌కు ముందు మేక‌ర్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వ‌డం మామూలే. కానీ అలాంటి స్టేట్మెంట్లు కొన్ని సినిమాల విష‌యంలోనే నిజ‌మ‌వుతుంటాయి. చాలాసార్లు మేక‌ర్స్ చెప్పే మాట‌ల‌కు, సినిమాల్లో ఉన్న కంటెంట్‌కు పొంత‌న ఉండ‌దు. ప్రేక్ష‌కులు కూడా అంద‌రి మాట‌ల‌నూ న‌మ్మ‌రు. కొన్ని సినిమాల విష‌యంలో మాత్రం ఇలాంటి పెద్ద స్టేట్మెంట్లు ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచుతాయి.

ఇరుముడి విష‌యంలో ఇలాగే అంచ‌నాలు పెంచే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌, హీరో ర‌వితేజ‌. త‌న సినిమాల గురించి ఎప్పుడూ మ‌రీ గొప్ప‌గా చెప్పుకోని శివ నిర్వాణ.. ఇరుముడి విష‌యంలో మాత్రం చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశాడు. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో ఇంత ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా ఇంత వ‌ర‌కు రాలేద‌ని అత‌ను ఇరుముడి ప్రి రిలీజ్ ఈవెంట్లో ధీమాగా చెప్పాడు.

సౌత్ ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో ఎన్నో థ్రిల్ల‌ర్ సినిమాలు వ‌చ్చాయ‌ని.. అందులో బెస్ట్ మూవీస్ చాలా ఉన్నాయ‌ని.. కానీ ఒక ఫ్యామిలీ మూవీ థ్రిల్లింగ్‌గా, ఇంటెన్స్‌గా ఉండ‌డం అరుద‌ని.. ఇరుముడి ఆ కోవ‌కు చెందిన సినిమానే అని.. తాను ఇలాంటి సినిమాను ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని అత‌ను చెప్ప‌డం విశేషం.

టైటిల్, పాట‌లు చూసి ఇదేదో అయ్య‌ప్ప‌స్వాముల‌కు సంబంధించిన సినిమా అనుకోవ‌ద్ద‌ని.. ఈ సినిమా మొద‌ట్లో కొంచెం స‌ర‌దాగా ఉన్నా.. త‌ర్వాత చాలా ఇంటెన్స్‌గా, సీరియ‌స్‌గా మారుతుంద‌ని.. ప్రేక్ష‌కులు అందుకు ప్రిపేరై రావాల‌ని.. సినిమా అయ్యాక ఒక పావుగంట పాటు ఆడియ‌న్స్ ఒక ట్రాన్స్‌లో ఉండిపోతార‌ని.. బ‌ల‌మైన ఎమోష‌న్ వారిని వెంటాడుతుంద‌ని శివ నిర్వాణ చెప్పాడు.

ఇక ర‌వితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొత్త ర‌వితేజ‌ను చూస్తార‌ని.. ఇరుముడి త‌న అభిమానుల‌తో పాటు సామాన్య‌ ప్రేక్ష‌కుల‌కు కూడా పిచ్చి పిచ్చిగా న‌చ్చేస్తుంద‌ని అన్నాడు. ఇంత‌కుమించి సినిమా గురించి ఎక్కువ మాట్లాడ‌న‌ని.. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ గురించి కూడా స‌క్సెస్ మీట్లోనే మాట్లాడ‌తాన‌ని ర‌వితేజ అన్నాడు. మ‌రి హీరో, డైరెక్ట‌ర్ చెబుతున్నంత గొప్ప‌గా ఇరుముడి ఉంటుందేమో ఈ నెల 21న చూడాలి.

This post was last modified on August 17, 2026 7:44 am

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

1 hour ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago