Trends

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై జరుగుతున్న చర్చ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి కారణం.. కోర్టు ఇచ్చిన తీర్పుగా చెప్పాలి. పెళ్లైన ఆర్నెల్లకే విడిపోయి.. విడాకులకు సిద్దమైన జంటకు కోర్టు అందుకు అంగీకరించటం ఒక ఎత్తు అయితే.. భరణం కింద భార్యకు చెల్లించాల్సిన మొత్తం మీద కోర్టు ఆదేశాలు ఈ చర్చ మొత్తానికి కారణంగా చెప్పాలి.

ఎందుకంటే..సదరు మహిళ జాబ్ చేస్తున్నారు. నెలకు రూ.1.4 లక్షల జీతాన్ని సంపాదిస్తున్నారు. విడాకుల కారణంగా తనకు భరణం ఇవ్వాలని కోరటం ఒక ఎత్తు.. అందుకు తగ్గట్లే ఆమెకు నెలకు రూ.1.35 లక్షల మొత్తాన్ని భరణం రూపంలో చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

పెళ్లైన ఆర్నెల్ల వ్యవధిలోనూ విడిపోయిన దానికి.. అతను జీవించినంత కాలం భరణం చెల్లిస్తూ ఉండాల్సిన రావటంపై చర్చ జరుగుతోంది. అంతేకాదు.. సదరు మహిళ జాబ్ చేయటం.. ఆమె జీతానికి దగ్గరగా భర్త భరణం ఇవ్వాల్సిన రావటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫుణెకు చెందిన భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులే. పెళ్లైన ఆర్నెల్లకే వారి మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో వారిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

భర్త సంపాదన నెలకు రూ.2.79 లక్షలు కాగా.. భార్యకు జీతం నెలకు రూ.1.41 లక్షలు. భర్తకు తన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. అయితే.. భర్త నుంచి విడిపోయిన తర్వాత జీవనం సాగించేందుకు సరిపోయే జీతం పొందుతున్నా.. పెళ్లైన ఆర్నెల్ల వ్యవధిలో తాను సాగించిన లైఫ్ స్టైల్ విడాకుల తర్వాత కూడా కొనసాగించే హక్కు తనకు ఉందని.. తనకు భరణం ఇవ్వాలని ఆమె కోర్టులో వాదనలు వినిపించింది.

తనకు ఇవ్వాల్సిన భరణం.. భర్త జీతంలో సగం అంటే రూ.1.35 లక్షలు ఇవ్వాలని కోరగా.. అందుకు కోర్టు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భరణం అన్నది సదరు వ్యక్తి వ్యక్తిగత ఖర్చుల కిందకు వస్తుంది కాబట్టి.. దానికి ఆదాయపన్ను మినహాయింపు ఉండదు. అంటే.. సదరు భర్త నెల నెలా తన మాజీ భార్యకు భరణం రూపంలో చెల్లించే మొత్తానికి కూడా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది.

భార్యకు సౌకర్యవంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన సంపాదన ఆమె సంపాదిస్తున్నప్పటికి.. మాజీ భర్త తన జీతంలో సగం మొత్తాన్ని భరణం రూపంలో ఇవ్వాల్సిన రావటాన్ని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పెళ్లై కేవలం ఆర్నెల్లు మాత్రమే అయ్యిందని.. ఎలాంటి సంతానం.. బాధ్యతలు లేనప్పటికి ఇంత భారీగా భరణం ఇవ్వాల్సి రావటంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on June 11, 2026 10:17 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

3 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

5 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

6 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

6 hours ago