Political News

సీఎం విజ‌య్‌కు జై కొట్టిన డీఎంకే ఉద‌య‌నిధి!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్తులుగా ఉన్న వారు అన్ని విష‌యాల్లోనూ క‌య్యానికి కాలు రువ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌లు సంద‌ర్భాల్లో త‌మిళ‌నాడు రాష్ట్ర పొలిటిక‌ల్ నేత‌లు నిరూపించారు. రాష్ట్రంలో అంత‌ర్గ‌తంగా ఎన్ని మాట‌లు అను కున్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు చేసుకున్నా.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో పోరాడాల్సి వ‌చ్చినప్పుడు.. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. అంద‌రూ ఒక‌టైపోతున్నారు. తాజాగా సీఎం విజ‌య్‌.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, డీఎంకే యువ నేత ఉద‌య‌నిధి స్టాలిన్‌లు క‌లిసిపోయారు.

అసెంబ్లీలో నీట్‌కు వ్య‌తిరేకంగా తీసుకువ‌చ్చిన తీర్మానానికి త‌మ సంపూర్ణ‌మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఉద‌య‌నిధి తెలిపారు. అంతేకాదు.. విజ‌య్ స‌ర్కారుకు ఆయ‌న కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. కేవ‌లం తీర్మానం చేసి ఊరుకోవడం కాద‌ని, దీనిని సాధించే వ‌ర‌కు కూడా కేంద్రంపై యుద్ధం చేయాల‌ని పేర్కొన్నారు. విప‌క్ష నాయ‌కుల‌ను అవ‌స‌రమైతే ఢిల్లీకి కూడా తీసుకువెళ్లాల‌న్నారు. ఒక్క బీజేపీ మిన‌హా.. రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాలు కూడా నీట్ కు వ్య‌తిరేకంగా విజ‌య్ ప్ర‌భుత్వం తీసుకువచ్చిన తీర్మానానికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపాయి.

రెండు రోజుల కింద‌టి వ‌ర‌కు..

త‌మిళ‌నాట‌.. రెండు రోజుల కింద‌టి వ‌ర‌కు.. రాజ‌కీయాలు వేడెక్కాయి. విజ‌య్ స్నేహితురాలు త్రిష‌పై ఉద‌య‌నిధి ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారంటూ ఉన్న‌ప‌ళాన ఆయ‌న‌ను అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. అయితే.. కోర్టు జోక్యంతో ఉద‌య‌నిధిని వ‌దిలేసినా.. కేసు మాత్రం వెంటాడుతోంది. అసెంబ్లీలోనూ ప‌లు అంశాల‌పైనా.. ముఖ్యంగా శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంపై ర‌చ్చ కొన‌సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే.. మాత్రం అధికార పక్షానికి ఉద‌య‌నిధి జై కొట్ట‌డం గ‌మ‌నార్హం.

తాజా తీర్మ‌నంలో..

త‌మిళ‌నాడు అసెంబ్లీ నీట్‌కు వ్య‌తిరేకంగా తాజాగా చేసిన తీర్మానం ప్ర‌కారం.. 12వ త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా వైద్య విద్య‌లో ప్ర‌వేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తించాలి. నీట్ ప‌రీక్ష విధానాన్ని పూర్తిగా ర‌ద్దు చేయాలి. దీనిద్వారా త‌లెత్తిన గంద‌ర‌గోళ ప‌రిస్థితిని పూర్తిగా రూపుమాపేందుకు నీట్‌ను ర‌ద్దు చేయ‌డ‌మే ప‌రిష్కారం. ఇది ప్రాంతీయ త‌త్వానికి విఘాతం క‌లిగిస్తోంది. ఆర్టిక‌ల్ 14 ప్ర‌కారం.. ఉండాల్సిన విద్యార్థుల స్వేచ్ఛ‌(వారికి న‌చ్చిన భాష‌లో విద్య‌నుఅభ్య‌సించ‌డం) ను కూడా హ‌రిస్తోంది. అందుకే దీనిని ర‌ద్దు చేయాలి. అని తీర్మానంలో పేర్కొన్నారు.

This post was last modified on August 11, 2026 9:13 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

18 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago