అదేంటో విచిత్రంగా డిసి సినిమాకు తమిళనాడు కంటే ఏపీ తెలంగాణలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. సోమవారం గ్రాస్ చూసుకుంటే మన వైపే ఎక్కువగా ఉండటం చూసి కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ కు దర్శకుడిగా ఇక్కడ ఎంత గుర్తింపున్నా హీరోగా అతను కొత్త వాడే. అందులోనూ తెలుగు ప్రమోషన్లను టీమ్ లైట్ తీసుకుంది. చెన్నైలో అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కన్సర్ట్ తో గ్రాండ్ ఈవెంట్ చేస్తే ఇక్కడ కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.
నిజానికి మనకు ఇలా పొరుగింటి పుల్లకూరలు రుచిగా అనిపించడం మొదటిసారి కాదు. గతంలో శంకర్ సినిమాలు ఒరిజినల్ వెర్షన్ కంటే మన దగ్గరే బాగా ఆడిన దాఖలాలు ఎక్కువ. అపరిచితుడు నైజామ్, సీడెడ్ లో వంద రోజులు ఆడిన సెంటర్లున్నాయి. బాయ్స్ ఇక్కడ కొన్ని వారాల పాటు స్ట్రాంగ్ గా నిలబడి పే చేసింది. విక్రమ్ ఐకి తమిళనాడు కన్నా ముందు బెనిఫిట్ షోలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పడ్డాయి. ఫ్లాప్ టాక్ వచ్చాక కూడా రెండో వారం దాకా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు డిసి కూడా అదే కోవలో వెళ్తోంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వామిక గబ్బి నటన, టెక్నికల్ టీమ్ పనితనం, ఎక్స్ ట్రాడినరి అనిపించకపోయినా లోకేష్ యాక్టింగ్ ప్లస్ స్క్రీన్ ప్రెజెన్స్ వెరసి సోషల్ మీడియా మద్దతు ఫుల్లుగా దొరికింది. ఇవాళ బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే కొరియన్ కనకరాజుకు గంటలకు పదకొండు వందల దాకా టికెట్లు అమ్మడుపోతుండగా డిసి ఏకంగా ఏడు వేల టికెట్ల దగ్గర పరుగులు పెడుతోంది. టాప్ పొజిషన్ లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇంకా కొనసాగుతోంది.
పైన హెడ్డింగ్ లో చెప్పిన వాస్తవాన్ని చరిత్ర చాలాసార్లు రుజువు చేసింది. మణిరత్నం నాయకుడు, మౌనరాగం నుంచి మోహన్ లాల్ తుడరం దాకా రిపీట్ అవుతూనే ఉంది. డిసి మన దగ్గర అంత ఈజీగా నెమ్మదించేలా లేదు. వచ్చే వారం లాంగ్ వీకెండ్ ఉంది. ఇండిపెండెన్స్ డే కలిసి వస్తోంది. యాభై కోట్లు వచ్చినా లేదా అంతకన్నా తక్కువ దగ్గరే ఆగినా డిసిని మన ఆడియన్స్ దగ్గర తీసుకున్న మాట వాస్తవం. కాకపోతే ఈ అభిమానం వసూళ్లను ఎక్కడిదాకా తీసుకెళ్తుందనేది చూడాలి.
This post was last modified on August 12, 2026 7:32 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…