ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సరళమైన భాషలో చాగంటి ప్రవచనాలను పుస్తకాలుగా అందించనున్నట్టు పేర్కొంది. వీటిని పాఠ్యాంశాలుగానే చూడాలని తెలిపింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా చాగంటి ప్రవచనాల పుస్తకాలను ఇస్తున్నట్టు తెలిపింది. అయితే.. ఆయా అంశాల్లో తేడా ఉంటుందని.. 1 నుంచి 5వ తరగతి వరకు సరళమైన అంశాలు.. 6-10వ తరగతి వరకు విలువలతో కూడిన విద్యపై పాఠ్యాంశాలు ఉంటాయని తెలిపింది.
మార్కులు కూడా..
ఈ పాఠ్యాంశాలకు మార్కులు కూడా కేటాయించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. మొత్తం 8 నుంచి 10 మార్కులకు సంబంధించి చాగంటి పుస్తకాల నుంచి ప్రశ్నలు వస్తాయని.. విద్యార్థులు సులువుగా అర్ధం చేసుకుని వాటికి సమాధానాలు రాయొచ్చని పేర్కొంది. ఒక్కొక్క పుస్తకం 40-50 పేజీలతో ఉంటుందని.. వీటిని ప్రభుత్వమే ఉచితంగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేయనుందని వివరించింది. మంత్రి నారా లోకేష్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా ఈ పాఠ్యాంశాలను ప్రవేశ పెడుతున్నామని ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. కాగా.. విలువల విద్య అంశానికి సంబంధించి చాగంటిని ప్రభుత్వం సలహాదారుగా నియమించుకున్న విషయం తెలిసిందే.
ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, విద్యాలయాల్లో పర్యటించి.. విద్యార్థులకు అవసరమైన విలువలను బోధిస్తారు. తన ప్రవచనాల ద్వారా వారిలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో మరోసారి స్పష్టం చేశారు. చాగంటి పర్యటనల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్, పోలీసులు కూడా రావాలని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా భద్రత కల్పించాలని సూచించారు. కాగా.. చాగంటి ప్రవచనాలను పాఠ్యాంశాలుగా ముఖ్యంగా మార్కులతో అనుసంధానం చేయడం ఇదే తొలిసారి. మరి దీనిపై విమర్శలు వస్తాయో ప్రశంసలు వస్తాయో చూడాలి.
ఇవీ పాఠ్యాంశాలు..
1-5 వ తరగతి వరకు: అమ్మానాన్నల విలువ, వారి ప్రేమ. కుటుంబ విలువలు. స్నేహితులు, మనో నిబ్బరం, ఓర్పు క్రమ శిక్షణ. మంచి అలవాట్లు వంటి వాటిని పాఠ్యాంశాలుగా చేర్చారు.
6-10వ తరగతి వరకు..: పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, చెట్ల విలువ, వాతావరణ పరిస్థితులు.. జల విలువ, నీటి సంరక్షణ విధానాలను పాఠ్యాంశాలుగా పేర్కొన్నారు. వీటికి 8 – 10 ప్రశ్నలు ఉంటాయని ఉత్తర్వుల్లో తెలిపారు.
This post was last modified on June 10, 2026 10:26 pm
టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…
నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…
ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…
ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్టయిందంటే.. ఆ చిత్రానికి కలిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు తమ చిత్రాల్లో…
వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…