Movie News

యష్‌ను హీరోయిన్స్ మింగేస్తారా?

రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా ‘టాక్సిక్’ ట్రైలర్, ప్రోమోలు చూస్తుంటే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. యష్ ను హీరోయిన్స్ మింగేస్తారా అనే కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. దీని అర్థం సినిమాలో హీరో క్యారెక్టర్ స్కోప్ తగ్గిపోతుందని కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఫీమేల్ కాస్ట్ కి దక్కిన అటెన్షన్ చూస్తే ఎవరికైనా ఇలాంటి క్యూరియాసిటీ రావడం సహజం.

ఈమధ్య కాలంలో వచ్చిన కేజీఎఫ్, సలార్, పుష్ప, దేవర లాంటి భారీ యాక్షన్ సినిమాలు తీసుకుంటే, ప్రమోషన్స్ లో హీరోకి సమానంగా మేల్ విలన్స్, అపోజిషన్ క్యారెక్టర్స్ ఎక్కువగా హైలైట్ అయ్యాయి. ఆ సినిమాల్లో కథంతా వాళ్ళ చుట్టూనే డామినేట్ చేస్తూ నడిచింది. కానీ టాక్సిక్ విషయానికి వచ్చేసరికి, ప్రమోషన్స్ లో ఫోకస్ అంతా ఒక పెద్ద ఫీమేల్ స్టార్స్ వైపు షిఫ్ట్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తోంది.

ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ లాంటి సాలిడ్ లేడీ స్టార్స్ ఉన్నారు. మేకర్స్ కూడా వీళ్లందరినీ ఇండివిడ్యువల్ గా హైలైట్ చేస్తూ వస్తున్నారు. ట్రైలర్, ప్రోమోలు గమనిస్తే హీరో తర్వాత వాళ్ళ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఒక గ్యాంగ్‌స్టర్ కథలో ఇంతమంది హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే కాకుండా స్పెషల్ గా చూపిస్తుండటం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.

ఫీమేల్ కాస్ట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి, సినిమాలో అసలు మేల్ క్యారెక్టర్లు లేరని అనుకోలేం. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ లాంటి మేల్ యాక్టర్లు కూడా ఇందులో కీ రోల్స్ చేస్తున్నారు. వీళ్ళు ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ లో మాత్రం ఫీమేల్ స్టార్స్ కే ఎక్కువ విజిబిలిటీ వచ్చింది. ఆ మేకర్స్ ఉద్దేశపూర్వకంగానే లేడీ క్యారెక్టర్స్ ను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

గీతు మోహన్‌దాస్ టేకింగ్ లో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే యాడ్ అయినట్లు అనిపిస్తోంది. యాక్షన్ కథల్లో లేడీ రోల్స్ ని ఇంత స్పెషల్ గా డీల్ చేయడం ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. యష్ లాంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న హీరో ఎదురుగా, ఫీమేల్ క్యారెక్టర్లు ప్రమోషన్లలో తెచ్చుకున్న ఈ హైప్ ఫైనల్ గా తెరపై అడ్వాంటేజ్ గా మారుతుందా అనేది ఇప్పుడు అసలైన పాయింట్. ఈ క్యారెక్టర్లన్నీ హీరోని డామినేట్ చేయకపోయినా, కథలో ఇవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయనేది ఆసక్తికరం. సినిమాలో వీళ్ల యాక్షన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో థియేటర్లలో చూడాలి.

This post was last modified on August 11, 2026 9:58 pm

Share

Recent Posts

సెటిల‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్న క‌విత‌!

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ ఎస్‌) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ.. క‌విత…

28 minutes ago

చిరంజీవి పేరులో ఆ లెటర్ మిస్సయితే

మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ ఒక టాక్ షోలో చూశాం. మా టీవీ కోసం ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు…

2 hours ago

ఆర్జీవీ ఎప్పటికీ బతికుండే ప్లాన్

రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఏళ్ల నుంచి తన స్థాయికి ఏమాత్రం తగని పేలవమైన సినిమాలు తీస్తున్నా.. కొన్ని ఇంటర్వ్యూలో దారుణమైన…

2 hours ago

ఆ ప్రాజెక్టు ఆపాలని జగన్ కు కేసీఆర్ వార్నింగ్: హరీష్ రావు

ఏపీ మాజీ సీఎం జగన్ కు కృష్ణా జలాలు అప్పణంగా ఆంధ్రాకు తరలించేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని…

2 hours ago

ఒక్కరోజులో 3 లక్షల కోట్ల లాభం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ ప్రముఖ టెక్ కంపెనీల విలువతో పాటు వాటి అధినేతల…

3 hours ago

శ్రీవిష్ణు పంచులు పాజిటివ్‌గా వెళ్తున్నాయా

నిన్న విడుదలైన ఫ్యామిలీ ప్యాక్ టీజర్లో శ్రీవిష్ణు వేసిన కొన్ని పంచులు, ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్…

3 hours ago