Movie News

వర్మ పోలీసు కంపెనీ హడావిడి ఎలా ఉంది?

రాం గోపాల్ వర్మ అంటేనే ఒక బ్రాండ్. ఆయన సినిమాలకు హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేదు. ఇండియా వెండితెర మీద తనదైన ముద్ర వేసిన అద్భుతమైన దర్శకుడు. అందుకే వర్మ సినిమాకు హిట్, ప్లాప్ అనేవి వర్తించవు. ఎన్నో వండర్ ఫుల్ సినిమాలు నిర్మించిన వర్మ గత కొన్నేళ్లుగా పరమ చెత్త సినిమాలు చేశాడు. అయినా ఆయన క్రేజ్ తగ్గలేదు. మళ్ళీ కొత్త సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ. అభిమానులను అసంతృప్తికి గురిచేయకుండా వర్మ కొత్త సినిమా కమిట్ అయ్యాడు.

ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ల నేపథ్యంలో పోలీస్ కంపెనీ పేరుతో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దావుద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ గ్యాంగ్ ల మధ్య జరిగిన పోరాటాలను కట్టడి చేసేందుకు ఆనాటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్క్వాడ్ స్పూర్తితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ గా బాలీవుడ్ నటుడు హర్ష వర్ధన్ రాణే నటిస్తున్నట్లు సమాచారం.

ఈ తరహా సినిమాలు తెరకెక్కక చాలా రోజులైంది. ముంబై ప్రజలు కూడా గ్యాంగ్ స్టర్లను మరిచిపోయారు. ఇప్పుడంతా ఇండియన్ సినిమా ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. కేజీఎఫ్ మాయలో పడింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథలు అలరిస్తున్నాయి. కర్ణాటక బంగారు గనుల్లో అధికారం చేజిక్కించుకున్న రాకీ కథ ఆ మధ్య బాగా అలరించింది. వర్థరాజ మన్నార్ కథతో వచ్చిన సలార్ హిట్ కొట్టింది. ముంబై బయటి ప్రపంచంలోని డార్క్, యాక్షన్, గ్యాంగ్ వార్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు వర్మ పోలీస్ కంపెనీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

This post was last modified on August 11, 2026 9:56 pm

Share

Recent Posts

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

18 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

58 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

12 hours ago