Movie News

చిరు లీక్స్… మెగా 158 టైటిల్

చిరు లీక్స్ ఎంత పాపులరో తెలిసిందే. తనవి లేదా తన ఫ్యామిలీ సినిమాలు ఏవైనా నిర్మాణంలో ఉన్నప్పుడు అఫీషియల్ గా వదలని ఏదో ఒక అప్డేట్ పబ్లిక్ ఈవెంట్స్ లో చెప్పేయడం చిరంజీవికి కొత్త కాదు. గతంలో ఆచార్యని అలాగే చెప్పేసి టీమ్ కు షాక్ ఇచ్చారు. తాజాగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ మెగా 158 టైటిల్ ‘కదిరి’ అని రివీల్ చేయడం ఒక్కసారిగా అక్కడున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ రూపంలోనూ ఈ పేరు బయటికి రాలేదు.

గతంలో కాకాజీ అనే టైటిల్ అనుకున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఇప్పుడు కదిరిగా ఫిక్స్ చేయడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇది అనంతపురం జిల్లాలోని ఒక పట్టణం పేరు. మాములుగా ఊరి పేర్లు సినిమా టైటిల్స్ గా పెట్టడం కొత్త కాదు. అన్నవరం, భద్రాచలం, శ్రీశైలం, తిరుపతి, భద్రాద్రి మొదలైనవి ఆ కోవలో వచ్చినవే. కాకపోతే వీటిలో అధిక శాతం సదరు ఊర్లతో సంబంధం లేకుండా కథలు నడిచేవి. మరి కదిరి ఎలా ఉంటుందో చూడాలి.

ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నారు. రీ రికార్డింగ్ అయిపోయిందా అంటూ తమన్ ని ఇదే వేడుకలో చిరంజీవి ప్రశ్నించడం దగ్గరి నుంచి ఈ లీక్ బయటికి వచ్చింది. అదేదో కావాలని చెప్పినట్టుగా ఉందని వీడియో చూస్తే అనిపిస్తుంది. లేదా ప్రస్తుతానికి వేరే టైటిల్ చెప్పి డైవర్ట్ చేసి అసలు ట్విస్టు బర్త్ డేకి ఇస్తారానేది వేచి చూడాలి. ఈ మధ్యే దర్శకుడు బాబీ అన్నయ్య ఎక్కడా లీక్స్ ఇవ్వడం లేదని సంతోషపడిన విషయం తెలిసిందే.

2027 సంక్రాంతి విడుదలని టార్గెట్ చేసుకున్నట్టుగా ప్రచారంలో ఉన్న కదిరి దానికి అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపధ్యంతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్, మాస్ మూమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉండేలా బాబీ డిజైన్ చేసుకున్నారని యూనిట్ టాక్. గాడ్ ఫాదర్ తో కమర్షియల్ సినిమా దక్కించుకోలేకపోయిన తమన్ ఈసారి చిరంజీవి కోసం ఎలాంటి ఆల్బమ్ ఇస్తారోనని ఓజి రేంజ్ లో సినీ ప్రియులు అంచనాలు పెట్టుకున్నారు. 

This post was last modified on August 11, 2026 8:20 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

33 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

1 hour ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago